ఆ... నలుగురు
_ప్రభుత్వం తన స్టాండ్ ఆది అంతం ఒకేలా ఉంది.
_చీకటి జీవోలు రద్దుచేస్తే చర్చలన్నారు. మరి ఎందుకిలా మారిపోయారు.
_ఎమీ సాదించారంటే మన త్యాగాలతో వారి నాయకత్వాలను పటిష్ట పరుచుకున్నారు.
_చేతగాని వారు నాయకత్వాల్లో ఎందుకు??
_వందల్లో మీ స్థానాలను భర్తీ చేసే పటిష్టమైన నాయకులు ఉన్నారు కదా.!!
_CPS రద్దుపై ఎమీ మాట్లాడారంటే తుస్సే.
_టీచర్లు జెఏసీ అనివార్యం.
ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నాం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కనుక 23% ఫిట్మెంట్ ఓప్పుకున్నాం అని ఈ నాలుగు స్దంభాలు చైర్మన్లు బండి, బొప్ప,వెంకటరెడ్డి, సూర్యనారాయణలు బయటకు వచ్చి అహా-ఓహా అని మీడియాలో సంకలు గుద్ది, పాలాభిషేకాలు చేసిన విషయం విధితమే..
●ఆ మర్నాడు నుండి ఉపాధ్యాయ సమాజం ముఖ్యంగా యూటీఏఫ్, పిడియఫ్ ఎమ్మెల్సీలు, ఇతర సంఘాలు బోగి, సంక్రాంతి పండగనీ చూడకుండా ఈ ఉధ్యమ జ్వోతిని రగిలించారు.
● అనంతరం ఫ్యాఫ్టో ఉధ్యమంలో మమేకం అవ్వడంతో ఉధ్యమాన్ని పరుగులెత్తించారు.
● నల్లబాడ్జీలతో నిరసన,తాలూక కేంద్రాల్లో నిరసనలు,అనంతరం జిల్లా కలెక్టరేట్లు మట్టడితో దద్దరిల్లాయి.
● ఈ దాదాపు ఈ 10 రోజులు ఉధ్యమం ప్రస్థానంలో ఈ బండి,బొప్పరాజు,వెంకట్ రెడ్డి,సూర్యానారాయణుడు నోరు మెదపలేదు కదా ఎక్కడ ఉన్నారో ఉనికే లేదు..!!
● ఫ్యాఫ్టో ఉధ్యమంతో ఉలిక్కిపడి,క్రింద స్థాయి ఉధ్యోగులు ఓత్తడి తట్టుకోలేక అదేరోజు నాలుగు జెఏసీలు కలిశాం ఇది మా ఉధ్యమ కార్యచరణ అని ప్రకటించి ఉధ్యోగులో రగిలే సెగలకు మరీంత అధ్యం పోషారు.. పాపం అందరం నమ్మి వీరి నాయకత్వంపై ఆశలు పెంచుకున్నాం.
ఏమి సాధించారు..???
కామ్రేడ్స్ ప్రభుత్వం స్టాండ్ ఎప్పుడు ఒకేలా ఉంది,కానీ మన నాయకులు స్టాండ్ మారుతూ వచ్చింది, ఇందులో ముగ్గురు మరో రెండు నెలల్లో రిటైర్మెంట్ అవుతారు,కనుక వారికి 2 సంవత్సరాలు పెరిగింది ఇదీ కదా ఈ లక్షలాది త్యాగాలు ఫలితం..!!
● మనం ఎప్పుడు ఈ నాయకత్వాలు చేతిలో మోసపోవడం జరుగుతుంది..
● మన ఉధ్యమాలు ఫలితాలే కదా ఆశోకబాబుకు ఎమ్మెల్సీ, మరో పూర్వ జెఏసీ చైర్మన్,NGO అధ్యక్షుడుకు ప్రభుత్వ సలహాదారుడయ్యాడు..
● ప్రస్తుత ఉధ్యమ ఫలితం ఈ నలుగురుకి ఎది వరించనుందో..!!
చివరకు లక్షలాది వేతన జీవుల్ని మోసం చేసారా.! ఈ లక్షలాది త్యాగం/పోరాటం మోసగించ బడిందా..!
0 Post a Comment:
Post a Comment