Friday 11 February 2022

ప్రీప్రైమరీ బోధించేవారు జూనియర్ ఎస్జీటీలే

 ప్రీప్రైమరీ బోధించేవారు జూనియర్ ఎస్జీటీలే



పాఠశాల విద్యలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఉపాధ్యాయుల పదోన్నతులపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది . ప్రీప్రై మరీ -1 , 2 కు బోధించే వారిని జూనియర్ ఎస్జీటీలుగా పేర్కొననున్నారు . వీరికి విద్యార్హత ఇంటర్మీడియట్ సరిపోతుంది . ఉపాధ్యాయుల్లో సీనియర్ .. ప్రధానోపాధ్యా యుడిగా ఉంటారు. 

ఒకటో తరగతికి సన్నద్ధత , ఒకటి , రెండు తరగతులకు బోధించేవారిని సీనియర్ ఎస్జీటీలుగా పిలుస్తారు . వీరికి ఇంటర్తో పాటు టీటీసీ అర్హత ఉండాలి . 3 , 4 , 5 తరగతులకు బోధించే స్కూల్ అసి స్టెంట్లను జూనియర్ స్కూల్ టీచర్గా భావిస్తారు . వీరికి డిగ్రీ , బీఈడీ అర్హత ఉండాలి . వీరిలో సీనియర్ ఉపాధ్యాయులు గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తారు . 6 , 7 , 8 తరగతులకు బోధించే స్కూల్ అసి స్టెంట్లను సీనియర్ స్కూల్ టీచర్ గా పేర్కొంటారు . వీరికి డిగ్రీ , బీఈడీ అర్హత తప్పనిసరి . సీనియర్ ఉపాధ్యాయులు గ్రేడ్ -1 ప్రధానోపాధ్యాయులుగా ఉంటారు . 10 , 11 , 12 తరగతులకు బోధించే వారిని పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ ( పీజీటీ ) గా పిలుస్తారు . వీరికి పోస్టు గ్రాడ్యుయేషన్ ( పీజీ ) తోపాటు బీఈడీ ఉండాలి . ప్రిన్సిపల్ ఉంటారు . పీజీటీ , గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయుల కేడర్ సమానంగా ఉంటుంది . వీరికి పోస్టుగ్రాడ్యుయేషన్ తప్పనిసరి . జూనియర్ ఎస్జీటీ , సీనియర్ ఎస్జీటీ , జూనియర్ స్కూల్ టీచర్ , సీనియర్ స్కూల్ టీచర్ , గ్రేడ్ -1 , 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తారు . జూనియర్ స్కూల్ టీచర్ ( ఎస్టీ ) , సీనియర్ ఎన్టీ , పీజీటీ , జూనియర్ లెక్చరర్ , సీనియర్ లెక్చరర్ , ప్రిన్సిపల్ స్థాయి వరకు పదోన్నతులు ఇస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top