Saturday, 19 February 2022

సామాన్యుల కోసం సైన్స్ - వ్యాసకర్త : యం.రాం ప్రదీప్

 సామాన్యుల కోసం సైన్స్ - వ్యాసకర్త : యం.రాం ప్రదీప్వ్యాసకర్త :

యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836


రెండేళ్ల నుంచి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవుడి స్వార్థంతో ప్రకృతిని నాశనం చేస్తుండటంతో కరోనా వంటివి విజృంభిస్తున్నాయి.సైన్స్ పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందించడంలో  ప్రపంచ వ్యాప్తంగా పాలకవర్గాలు విఫలం కావడంతో మతం కొత్త భాష్యాలతో తన ఉనికిని కాపాడుకుంటుంది.

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ అయిన్ స్టీన్ "సైన్సుని మానవ వికాసానికి ఉపయోగించాలి,అంతేగానీ మానవ వినాశనానికి కాదు"అంటారు.1939-45 ల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ పై అణుబాంబులు ప్రయోగించింది.ఫలితంగా అనేకమంది మరణించారు.పలువురు గాయపడ్డారు.మరో ప్రపంచ యుద్ధం రాకూడదనే ఉద్దేశంతో 1945లో ఐక్య రాజ్య సమితి ఏర్పడింది.

పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ దేశాలు కృషి చేయాలని ఐక్య రాజ్య సమితి కోరుతుంది.వాతావరణ కాలుష్యమే ప్రస్తుతం మనముందున్న అతి పెద్ద సమస్య. వివిధ సమావేశాలలో తీర్మానాలు అయితే చేస్తున్నారు కానీ,అవి అమలుకు నోచుకోవడం లేదు.పెరుగుతున్న భూతాపం వల్ల వివిధ రకాల వైరస్లు మానవాళికి తీరని నష్టం కలిగిస్తున్నాయి.గత రెండు ఏళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భూతాపం వల్లే ఏర్పడింది.వ్యాక్సిన్లు పేద దేశాలకు ఇంకా అందకపోవడంతో కరోనా ఇంకా ఏదో ఒక రూపంలో వ్యాపిస్తుంది.కరోనా ఇక ముగిసిన అధ్యయనం అని అప్పుడే చెప్పలేము.

సైన్సు మనిషి ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.మనిషి ప్రకృతిలో అతిగా జోక్యం చేసుకోవడం వల్ల రోజురోజుకూ కాలుష్య పరిధి పెరుగుతుంది.ఫలితంగా జీవ వైవిధ్యంలో మార్పులు వస్తున్నాయి.  సైన్స్ వేరు,టెక్నాలజీ వేరు.

సాంకేతిక పరిజ్ఞానం అనేది సైన్సు పరిశోధనలో ఒక భాగం.దీన్ని ఉపయోగించే వ్యక్తుల స్వభావం పైనే దీని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలకి స్కానింగ్ అవసరమని వైద్యుడు నిర్ధారణ చేసి పరీక్ష చేయడం వేరు.ఇదే సాంకేతిక పరిజ్ఞానాన్ని పుట్టబోయే బిడ్డ అడ లేదా మగ సంతానమని తెలుసుకోవడానికి వినియోగిస్తే అది కచ్చితంగా మనిషి తప్పదం అవుతుంది.ఈ తప్పులని సైన్సుకు ఆపాదించకూడదు.

అందుకే సైన్స్ వాదులు మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కొత్త మార్గాలని ఎంచుకోవాలి. మూఢ నమ్మకాలని వ్యతిరేకించడంతో పాటు వాటి వల్ల వచ్చే నష్టాలకు పరిష్కార మార్గాలు చూపించాలి.కరోనా మొదటి వేవ్ మరియు రెండవ వేవ్ సమయంలో అనేక ఆశాస్త్రీయ వైద్యాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.కొందరు వీటికి మతానికి ముడి పెట్టి ప్రజల్లో భావోద్వేగాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ సైన్స్ ఉద్యమకారులు ఓపికగా వివిధ మాధ్యమాల ద్వారా కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్గించారు.ఇదొక మంచి పరిణామం.

పాలక వర్గాలు ఎప్పుడూ ప్రజలను ఏదో ఒక భావోద్వేగాలతో ఉంచుతారు.వ్యక్తిగత విషయమైన మతం వారికొక ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతుంది.అందుకే వారు ఎక్కువగా సైన్సుని ప్రమోట్ చేయరు. విద్య,వైద్యం తదితరు విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చిన క్యూబా,న్యూజిలాండ్ వంటి దేశాలు కరోనా మహమ్మారిని అధిగమించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.

మూఢ నమ్మకాలని నమ్మిన వారికంటే సూడో సైన్స్ వాదులతోనే మరింత ప్రమాదం. వీరు మతానికి,సైన్సుకు ముడిపెట్టి మాట్లాడతారు.యూట్యూబ్ వీడియోలు కూడా ఇటువంటి వాటిపైనే ఎక్కువగా వస్తున్నాయి.ఈ నేపథ్యంలో సైన్సువాదులు,హేతువాదులు మరింత నేర్పుగా ప్రజల్లోకి వెళ్ళాలి.సైన్స్ ప్రచారానికి కొత్త మార్పులుఅన్వేషించాలి.హేళన,పరిహాసాల ద్వారా ప్రజల మనస్సులకు దగ్గరకాలేము.రాజకీయ నాయకులు,మత ప్రభోధకులు మతాన్ని  సున్నితమైన అంశంగా మార్చారు. ఇటువంటి సమయంలో సైన్స్ వాదులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.

వివిధ ఆచారాల్లో ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుంది. ఉదాహరణకు పసుపుకు కొంత ఔషధ గుణం కలిగి ఉంటుంది. ఇటువంటి విషయాలని గుర్తిస్తూనే, మూఢ నమ్మకాలని వల్ల వచ్చే నష్టాలను ఓపికగా వివరించాలి.వివిధ మత ప్రభోధకులు తాము చెప్పే విషయాన్ని నమ్మకంగా,ప్రేమగా  ప్రజలకు చెప్తారు..వారిని నిరంతరం కలుస్తారు. ఓదార్పు మాటలు చెప్తారు.ఇటువంటి చర్యల వల్ల వారు భక్తులకు దగ్గరౌతాయి.ఇటువంటి పద్ధతులనే సైన్స్ ప్రచారకర్తలు వినూత్న మార్గాలలో ప్రజలకు అవగాహనకల్పించాలి.ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించే విధంగా పాలక వర్గాలపై ఒత్తిడి తేవాలి.అప్పుడే సైన్స్ ఫలాలు సామాన్యులకు అందుతాయి.

ఫిబ్రవరి - సైన్స్ మాసోత్సవం

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top