Friday 4 February 2022

" సమ్మె" విషయం లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఎదురవుతున్న సందేహాలు - సమాధానాలు

 " సమ్మె" విషయం లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఎదురవుతున్న సందేహాలు - సమాధానాలు



సమ్మె నోటీసు ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగిస్తుందా...?

సమ్మె నోటీసు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించడం కుదరదు. 14 రోజుల నోటీసు పీరియడ్ ఇచ్చి సమ్మె లోనికి వెళ్ళడం అనే సర్వీస్ రూల్స్ పాటించి సమ్మె లోకి వెళ్తున్నాం కాబట్టి చట్ట పరంగా న్యాయ పరంగా ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు.


ఉద్యోగుల సమ్మె నోటీసు ఇస్తే "ఎస్మా" ప్రయోగిస్తారు అని అన్నారు కదా దానివల్ల ఉద్యోగులకు కలిగే నష్టం ఎలాంటిది...?

ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించే అధికారం లేదు కాబట్టే ప్రభుత్వం "ఎస్మా" ప్రయోగిస్తామని చెబుతోంది. "ఎస్మా" అనగా THE ESSENTIAL SERVICES MAINTENENCE ACT అనగా "అత్యవసర సేవల నిర్వహణ" అనగా ప్రజల సేవలకు ఇబ్బంది కలగకుండా నిర్బంధంగా ఉద్యోగి పని చేయాలి అనే చట్టం.  అంతేగానీ ఉద్యోగం నుండి తొలగించే చట్టం ఎంత మాత్రం కాదు.


"ఎస్మా " ప్రయోగించినా మనం సమ్మె లోకి వెళ్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటి...?

ఎస్మా చట్టం అన్ని శాఖల ఉద్యోగులు మీద ప్రయోగించడానికి వీలు లేదు. ( వైద్యం , ప్రజా రవాణా, రక్షణ మాత్రమే అత్యవసర శాఖల పరిధిలోకి వస్తాయి ) ఎస్మా ప్రయోగించినా సమ్మె లోకి ఉద్యోగులు మొగ్గు చూపితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి కావున సమ్మె లో ఉన్న ఉద్యోగులకు " No work - No pay " అమలు చేసే అవకాశం ఉంటుంది.


4. మరి సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె లోకి వెళితే జీతం లో కోత పడుతుందా...?

సమ్మె లో ఉద్యోగులు శాశ్వతంగా ఉండరు. చర్చల ద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల పట్టు విడుపు ల ద్వారా కొద్ది రోజుల్లోనే సమ్మె విరమణ జరుగుతుంది. తర్వాత జరిగే చర్చ లో సమ్మె కాలానికి జీతం ఇవ్వడం తో పాటు సమ్మె కాలం లోని రోజులను అర్హత గల సెలవు కింద పరిగణించాలి అని మరియు సమ్మె కాలం లోని రోజులకు బదులుగా భవిష్యత్తు లో జరిగే సెలవు పని దినాలలో పని చేయాలి అని ఉత్తర్వులు వస్తాయి. గతం లో జరిగిన సమ్మె రోజులలో ఇవే పరిణామాలు జరిగాయి.

విద్యా శాఖ లో వారు రెండవ పని అనగా భవిష్యత్తు లో సెలవు పని దినాలలో పని చేయాల్సి రావచ్చు.


5. మాది రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు లేదా మేము ఇంకా రెగ్యులర్ కాలేదు లేదా ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నాము కదా మరి మేము సమ్మె లోకి వెళ్ళే అర్హత ఉందా...?

ప్రొబేషన్ లో ఉన్న వారికె మాత్రం  సమ్మె చేయకూడదు మరియు ప్రభుత్వం లు వ్యతిరేకంగా చర్యలు చేయరాదు అని వారి నియామక పత్రం లో ఉంటుంది.

కావున పై విషయాలను దృష్టి లో ఉంచుకుని ఎవరూ ఎటువంటి అపోహలకు అనుమానాలకు తావు ఇవ్వకుండా నిరభ్యంతరంగా సమస్యల పరిష్కార సాధన కోసం " PRC సాధనా సమితి" సూచనల మేరకు అందరం ఒకే మాట ఒకే బాట గా పయనించి పోరాటం లో విజయం సాధిద్దాం.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top