Monday 21 February 2022

హెచ్ఎంల అలసత్వం - విద్యార్థులకు శాపం - విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యం - అమ్మ ఒడి పథకానికి అర్హత పొందాలంటే 75 శాతం హాజరు అనివార్యం

 హెచ్ఎంల అలసత్వం - విద్యార్థులకు శాపం - విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యం - అమ్మ ఒడి పథకానికి అర్హత పొందాలంటే 75 శాతం హాజరు అనివార్యం



 కోవిడ్ ప్రభావంతో కుదేలైన విద్యారంగాన్ని మళ్లీ గాడిన పడేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రెండేళ్ల పాటు ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులను బడిబాట పట్టించిం ది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే వారి చదువులు సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రత్యేక యాప్ను రూపొందించి విద్యార్ధుల హాజరును తప్పనిసరి చేసిం ది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమా న్యాలు ఈ యాప్ ద్వారానే విద్యార్థుల హాజరు నమోదు చేయాలని విద్యాశాఖ కమిషనరేట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రత్యేక యాప్ వినియోగంపై ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తుండటం విద్యార్ధులకు శాపంగా మారింది.

75 శాతం హాజరు తప్పనిసరి :

నిరుపేదల విద్యాభివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. బడి బాట పట్టిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ. 15వేలు చొప్పున రూ.14వేలు నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి, మరో రూ.వెయ్యి పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధికి) జమ చేస్తూ వస్తోంది. అయితే అమ్మ ఒడి పథ కానికి అర్హత సాధించాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి

హెచ్ఎంలకు షోకాజ్ :

విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్న 96 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు, 70 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యా లకు డీఈఓ కె. శామ్యూల్ సోమవారం షోకాజ్ నోటీ సులు జారీ చేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో మూడు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

నిర్దేశించిన హాజరు శాతం లేకపోతే అమ్మ ఒడి వర్తించదు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరును చైల్డ్ ఇన్ఫోతో అనుసంధానమైన మొబైల్ యాప్లో రోజూ నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియను సక్ర మంగా నిర్వహించకుండా కొందరు ప్రధానోపా ధ్యాయులు నిర్లక్ష్యం వహించారు. జిల్లాలోని 5,095 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 320 పాఠశాలలు ఇప్పటి దాకా హాజరు నమోదు చేయలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసు కోవచ్చు. మొత్తం 5,77,835 మంది విద్యార్థులకు గాను 4,91,302 మంది హాజరు నమో దు కాగా. మిగిలిన 15 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు హాజరైనా... యాప్లో నమోదు కాకపోవడంతో 'అమ్మ ఒడి పథకానికి అనర్హులుగా పరిగణించబడనున్నారు. 320 మంది ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా 86,533 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి దూరం కానున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top