Tuesday 18 January 2022

HRA తగ్గింపుపై హైకోర్టుకు : గజిటేడ్ అధికారుల జేఏసిఎన్

 HRA తగ్గింపుపై హైకోర్టుకు : గజిటేడ్ అధికారుల జేఏసిఎన్



11 వ పీఆర్సీలో ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో తీవ్ర ఆందోళనతో ఉన్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాల  ఉద్యోగులకు  ఆంధ్రప్రదేశ్ గజిటేడ్ అధికారుల జేఏసి ఆశాకిరణంలా కనిపిస్తోంది. 

  రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాల  ఉద్యోగులకు 30 శాతం కన్నా హెచ్.ఆర్.ఏ తగ్గించడం చట్టప్రకారం సాధ్యం కాదని, ఈ ఉత్తర్వులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు  గజిటేడ్ అధికారుల జేఏసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెవి కృష్ణయ్య, మేడేపల్లి అజయ్ చెప్పారు.

ఇదే అంశంపై వారివురు ‘ ఎన్ జీ ఓ హెరాల్డ్’ పత్రికతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 78(1) ప్రకారం  రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాల  ఉద్యోగుల సర్వీస్ ప్రయోజనాలకు రక్షణ కల్పించబడిందని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా  రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాల  ఉద్యోగుల సర్వీస్ ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిరక్షించడమే ఈ 78(1) ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. దీని ప్రకారం రాష్ట్ర సచివాలయం, హెచ్.ఓ.డి కార్యాలయాల సిబ్బంది పదోన్నతులకు పెన్షన్ కు హెచ్.ఆర్.ఏ కు ఎటువంటి భంగం కల్గించకుండా ఈ 78(1) పరిరక్షిస్తుందని తెలిపారు.

రాష్ట్ర సచివాలయం, హెచ్.ఓ.డి కార్యాలయాల సిబ్బంది  ఇంటి అద్దె భత్యాన్ని 30 శాతం నుంచి 16 శాతనికి తగ్గిస్తూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు… ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 78(1) పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై గజిటేడ్ అధికారుల జేఏసి తరుపున హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

 అంతేకాకుండా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో గృహ యజమానులు వసూలు చేసే ఇంటి అద్దె   హైదరాబాదుకు సమానస్ఠాయిలో ఉన్నాయన్నారు. ఒక డబుల్ బెడ్ అద్దె రూ. 15000 పలుకుతోందని చెప్పారు.  హైద్రబాదు నుండి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు తరలిరావడం కారణంగా వివిధ రకాలైనట్టువంటి సర్వీస్ సెక్టర్, , ఇతర అనుబంధ రంగాలు అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు… కాస్ట్ ఆఫ్ లీవింగ్ కూడా విపరీతంగా పెరిగి ఇంటి అద్దెలు ఆకాశనంటుతున్న తరుణంలో 16 శాతం హెచ్.ఆర్.ఎతో ఉద్యోగులు అద్దెలు ఎలా  భరించగలుగుతారో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 78(1)ను  ఉల్లంఘిస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని.. లేనిచో 78(1)ను అమలును కోరుతూ న్యాయస్ఠానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top