Monday 24 January 2022

సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలి

 సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలి



ముఖ్యమంత్రికి వేడుకోలు సభ.

మద్దతు ప్రకటించిన పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘ నేతలు.

30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఎన్ఎంఆర్, టైమ్స్కేల్, ఫుల్టైమ్, పార్ట్ టైమ్, కంటెంజెంట్, కన్సాలిడేట్ పే ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, జెఎసి స్టీరింగ్ కమిటీ నాయకులు కెఎస్ లక్ష్మణరావు, షేక్ సాల్జీ డిమాండ్ చేశారు. టైమే స్కేల్ సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు బి సురేష్, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో ముఖ్యమంత్రికి వేడుకోలు' పేరుతో సభ నిర్వహించారు. సభలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఈ ఉద్యోగులను రెగ్యులర్ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాలే రెగ్యులర్ చేయకుండా విధానాలు తీసుకొస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీఇచ్చి ఇప్పుడేమో సుప్రీం కోర్టు అడొస్తుందని చెబుతున్నారన్నారు. 4500 కుటుంబాలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్ట్రగుల్ కమిటీ పరంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చట్టానికి లోబడి నియామకమైన వారిని రెగ్యులర్ చేయకుండా ఆపడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి వారికి మేలు చేయాలన్నారు. ఎపి ఎన్జిఒ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్టీరింగ్ కమిటీ తరపున మద్దతు ఇస్తామన్నారు. ఈ కుటుంబాల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఉద్యోగ సఘాల నాయకులు శివారెడ్డి, వైవిరావు, బిసురేష్, చంద్రశేఖర్రెడ్డి, బి.సుబ్బారావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు వి రంగారావు, సెక్రటరీ సాయిబాబా బెంజ్మన్ రామస్వామి, కెవి రవిశంకర్ పాల్గొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top