Monday 17 January 2022

ఏపీలో యధావిధిగా విద్యాసంస్థలు : మంత్రి సురేశ్

ఏపీలో యధావిధిగా విద్యాసంస్థలు : మంత్రి సురేశ్



రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని , ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యభద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు . ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని , 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు . ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు . ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని , భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని తెలిపారు .

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top