Thursday 27 January 2022

చర్యలు తీసుకుంటే ఆ వెంటనే సమ్మె ప్రారంభిస్తాం : పోరాటకమిటీ హెచ్చరిక

 చర్యలు తీసుకుంటే ఆ వెంటనే సమ్మె ప్రారంభిస్తాం : పోరాటకమిటీ హెచ్చరిక



చలో విజయవాడకు తరలుతున్న లక్షలాదిమంది

జీతాల ప్రక్రియ చేపట్టలేదని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే ఆ వెంటనే సమ్మె ప్రారంభిస్తామని పిఆర్‌సి పోరాట కమిటీ హెచ్చరించింది. మంత్రుల కమిటీ వ్యాఖ్యల అనంతరం సచివాలయంలోనే ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఛలో విజయవాడతో పాటు, ఆందోళనను మరింత తీవ్రం చేయడంపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ జీతాల అంశంపై ఒత్తిడి తీసుకురావడం సబబుకాదన్నారు. ఆ కారణంతో ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే వెంటనే సమ్మెను ప్రారంభిస్తామని, 7వ తేది వరకు ఆగేది లేదని చెప్పారు. సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఇతర సంఘాలతో చర్చిస్తామని మంత్రులు అంటున్నారని, కొత్త సంఘాలను పెట్టి ఉద్యమాన్ని చీల్చాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. బప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని అన్నారు. పిఆర్‌సి ప్రకటనకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టు ఎన్నోసార్లు తిరిగామని తెలిపారు. కనీసం ఏడెనిమిది సార్లు చర్చలు కూడా జరిపామని, ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని అన్నారు

తమకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్ష్యమని పేర్కొన్నారు. పిఆర్‌సి జిఓలు రద్దు చేయలేని మంత్రులు తమ డిమాండ్లను ఏ విధంగా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.. ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడమంటే ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టినట్లేనని అన్నారు.

ఒత్తిడి మానుకోండి : బండి శ్రీనివాసరావు

చర్చల పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి చేయడం మానుకోవాలని ఎపి ఎన్‌జిఓ జెఎసి ఛైర్మన్‌, పోరాట కమిటీ నాయకులు బండి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఉద్యోగులు చేపట్టిన నిరాహారదీక్షను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదో మంత్రుల కమిటీ చెప్పాలన్నారు. కొంతమంది డిడిఓలు జీతాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్లద్దని సూచించారు. అలాగే పాత జీతాలు ఇచ్చేలా ఆర్థికశాఖ అధికారులు సహకరించాలన్నారు. అలాగే పిఆర్‌సి ప్రకారం జీతాలు వేయమంటున్నారని, ఇంతవరకు దానిపై ఎవరికీ అవగాహన కల్పించలేదని, ఏ పద్ధతిలో జీతాలు వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందన్నారు. కేంద్ర పిఆర్‌సి అమలు చేస్తామని చెబుతున్నారని, కేంద్రంలో 104 రకాల అలవెన్సులు ఉంటాయని, అవన్నీ ఇస్తారా అని ప్రభుత్వ ఉద్యోగుల సం:ఘం నేత కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుతోందని చెప్పారు.

పాత జీతాలే ఇవ్వాలి : డిడిఓలకు లేఖలు

ఉద్యోగులు తమకు పాత జీతాలే ఇవ్వాలని కోరుతూ డిడిఓలకు లేఖలు రాయాలని పోరాట కమిటీ సూచించింది. గురువారం సెక్రటేరియట్లో సమావేశమైన పోరాట కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుని అన్ని ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగులకు సూచించింది. దీనికోసం ఒక ఫార్మాట్‌ను తయారు చేసి ఉద్యోగ సంఘాలకు పంపించింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top