ఉద్యోగులను అవినీతిపరులుగా చిత్రీకరిస్తారా...? సర్కారుపై ఎంపీ రఘురామ ఆగ్రహం
‘‘ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు విలన్లా? వారిని ఆవిధంగా చిత్రీకరిస్తారా? అవినీతి అధికారులంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తారా? కరోనా సమయంలో జీతాల్లో కోత విధించినా సహకరించిన ఉద్యోగులపట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొడతారా? జీతాలు తగ్గించినా, సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా వారు పనిచేయలేదా?’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల ఆందోళన కంటే, మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కేసినో వ్యవహారానికి ప్రాధాన్యం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వలంటీర్ల ద్వారా ఉద్యోగులపై విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకుని, పార్టీ పనులు చేయించుకోవడం సిగ్గుచేటని రఘురామ విమర్శించారు
0 Post a Comment:
Post a Comment