Thursday 6 January 2022

రేపటి నుంచి సంక్రాంతి సెలవులు 17న మళ్లీ స్కూళ్లు

రేపటి నుంచి సంక్రాంతి సెలవులు - 17న మళ్లీ స్కూళ్లు



పాఠశా లలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ నెల 8 నుంచి సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీఈఆర్టీ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ నెల పది నుంచి 15 వరకు సెలవులు కాగా.. 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడం, 16వ తేదీ ఆదివారం కావడంతో మరో మూడు రోజులు పెరిగాయి. దీంతో ఈ శనివారం నుంచి 16వ తేదీ వరకు బడులు మూతబ డనున్నాయి. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల జూనియర్ కళాశాలలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఈ నెల 17న పునః ప్రారంభం కానున్నాయి. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ) విద్యార్థులకు ఈ నెల 8 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించారు. వారికి ఈ నెల 18 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top