Friday 10 December 2021

విలీన ప్రక్రియలో కొత్త పుంతలు - RJDs,DEOs and APCs సమీక్షా సమావేశంలోని ముఖ్యంశాలు.

విలీన ప్రక్రియలో కొత్త పుంతలు - RJDs,DEOs and APCs సమీక్షా సమావేశంలోని ముఖ్యంశాలు.



9-12-2021 పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమీషనర్, రాష్ట్ర పథక సంచాలకుల & అడ్వైజర్, ఇన్ఫ్రా వారు SCERT లో నిర్వహించిన RJDs,DEOs and APCs సమీక్షా సమావేశంలోని ముఖ్యంశాలు.


✒ 3,4&5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో వీలీనం సందర్భంగా  ఉపాధ్యాయుల సర్దుబాటు (1:20 & 1: 30)

✒ ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలోకి మాత్రమే కలపాలి. 

✒ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను ప్రస్తుతానికి మెర్జింగ్ ప్రక్రియ కు పరిగణించవద్దు. 

✒ ఒక కిలోమీటరు లోపు వేరే మండలం పాఠశాల వున్నా యాజమాన్యం ఒకటే అయితే తరగతులను కలపలచ్చు.

✒ 20 కన్నా తక్కువ స్ట్రెంగ్త్ వున్న ప్రాథమిక పాఠశాలలను మెర్జింగ్ కు పరిగణలోకి తీసుకోరు. 

✒ 100 కన్నా తక్కువ స్ట్రెంగ్త్ వున్న ఉన్నత పాఠశాలలోకి వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు

✒ అదేవిధంగా 1000 కన్నా  ఎక్కువ స్ట్రెంగ్త్ వున్న ఉన్నత పాఠశాలలోకి వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు.

✒ బాలికల పాఠశాలలోకి కూడా వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు.

✒ 20 కన్నా తక్కువ 40 లోపు స్ట్రెంగ్త్ వున్న ప్రాథమిక పాఠశాలలకు ఒక తరగతి గది మాత్రమే పరిగణించబడును. 41 నుంచి 100 లోపు 2 తరగతి గదులను పరిగణనలోకి తీసుకోబడును.

✒ 100 స్ట్రెంగ్త్ పైన వున్న ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే తరగతికి ఒక గది సూత్రం వర్తిస్తుంది. 

✒ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కి సంబంధించి ఏ పిల్లలకైతే  కిట్ల పంపిణీ చేయలేదు దానికి గల కారణాలను నూతన వెర్షన్ APP లో పొందుపరచడానికి ఆప్షన్ ఇచ్చారు. తక్షణమే ప్రధానోపాధ్యాయులందరు ఆ ఆప్షన్ లో సదరు విద్యార్థుల సమాచారాన్ని అప్లోడ్ చేయాలి.

✒ మండలాల్లో మిగిలిన జెవికె కిట్లను తక్షణమే DPO కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి తరలించాలి.

✒ నిష్ఠా 2.3 లో ఉపాధ్యాయులు అందరి నమోదు తప్పనిసరి

✒ PFMS అకౌంటెంట్ల నెంబర్లు త్వరితగతిన పాఠశాలలకు వచ్చేలా బ్యాంకు మేనేజర్లతో సంప్రదింపులు జరపాలి.

✒ పాఠశాలల పిసి ఖాతాల్లో వున్న నిధులను తక్షణమే వినియోగించాలి. ఖాతాల్లో వుంచరాదు.

✒ జిల్లా కార్యాలయానికి జమచేయవలసిన పెండింగ్ అడ్వాన్సులను తక్షణమే చెల్లించాలి లేదా సంబంధిత ఖర్చుల UC లు మరియు బిల్లులు సమర్పించాలి.

✒ కోవిడ్ - 19 లో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల వివరాలు తక్షణమే సమర్పించాలి.

✒ జిల్లా పథక సంచాలకుల కార్యాలయంలో పెండింగ్ లో వున్న అన్ని బిల్లులను ఫైల్స్ ను అత్యంత త్వరితగతిన క్లియర్ చేయాలి.

✒ మండలాల్లోని వున్న ఉన్నత పాఠశాలల్లోని అటల్టింకరింగ్ ల్యాబ్ లన్నీ వినియోగంలో ఉన్నాయో లేదో సమీక్షించి నివేదిక సమర్పించాలి.

✒ నాడు-నేడు మొదటి విడత పాఠశాలల ప్రోజెక్టులను క్లోజ్ చేసాక పనులన్నీ పూర్తి అయి వుండాలి అసంపూర్తిగా వున్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోబడును.

✒ WE LOVE READING క్రమం తప్పకుండా నిర్వహించాలి.

✒ FA1 మార్కుల పోస్టింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవలె.

✒ స్టూడెంట్ ఇన్ఫో లో మేపింగ్ ప్రక్రియ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తక్షణమే పూర్తి చేయవలె.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top