Wednesday 29 December 2021

PM-Kisan scheme: గుడ్‌న్యూస్‌.. ‘పీఎం కిసాన్‌’ సాయం ఖాతాల్లోకి ఎప్పుడంటే...?

 PM-Kisan scheme: గుడ్‌న్యూస్‌.. ‘పీఎం కిసాన్‌’ సాయం ఖాతాల్లోకి ఎప్పుడంటే...?



 ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం- కిసాన్‌) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ నిధుల్ని జనవరి 1న జమచేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకానికి సంబంధించి 10వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 1న మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విడుదల చేస్తారని పీఎంవో తెలిపింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.20వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేయనున్నట్టు పేర్కొంది.

దేశంలో అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో కేంద్రం ఏటా రూ.6వేలు చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1.6లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top