Wednesday 29 December 2021

బెంగాల్‌లో విద్యాసంస్థలకు సెలవులు...!

 బెంగాల్‌లో విద్యాసంస్థలకు సెలవులు...!



పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున...స్కూళ్లు, పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్‌ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నందు వల్ల కోల్‌కతాలో కంటోన్‌మెంట్‌ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు. కాగా, 20 నెలల విరామం తర్వాత నవంబర్‌లో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో మరోసారి మూతపడుతున్నాయి. మంగళవారం బెంగాల్‌లో 752 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కోల్‌కతాలో 204 కేసులు, 24 ఉత్తర పరగణాల్లో 102 కేసులు వచ్చాయి. అంతక ముందు రోజు 439 కేసులు వెలుగుచూశాయి. దీంతో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top