జనవరి 7న పాఠశాల భద్రత దినోత్సవం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జనవరి 7న ‘పాఠశాల భద్రతా దినోత్సవాన్ని’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాలల భద్రత – పాఠశాల భద్రత’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సన్నాహాక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, ఏపీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి కల్నల్ వి.రాములు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, రక్షక దళ, ఆరోగ్య, రవాణా, కుటుంబ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, అగ్నిమాపక వంటి శాఖలకు చెందిన విభాగాధిపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతూ ఏడో తేదీన అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడో తేదీకే పరిమితం కాకుండా, నిరంతరం అమలు జరిపి, విద్యార్థుల, పాఠశాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు. భద్రతా చర్యలు తీసుకోవలసిన అంశాలు, అమలు తీరుపై ఆయా విభాగాధిపతులు సలహాలు పంచుకున్నారు.
0 Post a Comment:
Post a Comment