వైఎస్సార్ ఫౌండేషన్ స్కూళ్లు
👉చిన్నారుల బంగారు భవితకు బాటలు వేసేలా.. వారికి సంపూర్ణ పోషణ, సమగ్ర విద్య అందించేలా ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.
👉రాష్ట్రంలో కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
👉 ప్రాథమిక పాఠశాలల ఆవరణలోనే అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించనున్నారు. వీటిని ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహించనున్నారు.
👉 తొలి దశలో 5,664 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలపనున్నారు. ఇందుకోసం 3,824 ప్రాథమిక పాఠశాలల ఆవరణలో 6,692 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు.
👉వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న 1,20,165 మంది చిన్నారుల విద్యకు బలమైన పునాది పడనుంది.
👉 తొలిదశలో చేపట్టే తరగతి గదుల నిర్మాణాన్ని 2021–2022 మధ్యలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది.
👉ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.669.20 కోట్లు ఖర్చు చేయనుంది.
👉 అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో కలిపి ఫౌండేషన్ స్కూళ్లుగా వాటిని మార్పు చేస్తున్నారు.
👉 అంగన్‌వాడీ కేంద్రాల తరహాలోనే ఫౌండేషన్ పాఠశాలలు బాలలకు అన్ని సౌకర్యాలు, మంచి విద్య అందిస్తాయి. అంగన్‌వాడీల్లో అందించే సంపూర్ణ పోషణ పథకాన్ని ఫౌండేషన్ పాఠశాలల్లోనూ అమలు చేస్తాం.
👉 ఆటపాటలతోపాటు బలమైన ఆహారం, ఆరోగ్యం, విద్యకు కేంద్రంగా ఇవి ఉంటాయి.
– కృతికా శుక్లా, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ సంచాలకులు
0 Post a Comment:
Post a Comment