Saturday 13 November 2021

నేడు బాలల దినోత్సవం - నవంబర్ 14 - చిన్నారులకు 14 సూత్రాలు

నేడు బాలల దినోత్సవం - నవంబర్ 14 - చిన్నారులకు 14 సూత్రాలు




 1️⃣ క్రమశిక్షణ వీడరాదు : అల్లరికి హద్దులు ఉండాలి. టీవీ, చరవాణి, వీడియో గేమ్స్‌ కాలక్షేపం కావాలి కాని, వ్యసనం కారాదు.


 2️⃣ ఆరోగ్యం - మహాభాగ్యం : చిన్నారులు పిజ్జాలు, బర్గర్లు కాకుండా.. పోషకాహారం తినేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి.


3️⃣ చదువు వ్యసనం అవ్వాలి : కథలు, ఇతర పుస్తకాలు చదివితే ఆసక్తి పెరుగుతుంది. స్కిట్స్‌, రోల్‌ ప్లే పద్ధతిలో బోధించాలి.


4️⃣ ప్రయోగం - ప్రయోజనం : ప్రయోగాత్మక విద్యతోనే ప్రయోజనం చేకూరుతుంది. సైన్సు విజ్ఞాన యాత్రల్లో భాగస్వామ్యం చేయాలి.


5️⃣ బట్టీకి స్వస్తి : బట్టీ విధానానికి స్వస్తిపలకాలి. కొత్త అంశాలు నేర్చుకొనేలా ప్రోత్సహించాలి.

6️⃣ విషయం ఉండాల్సిందే : విషయ పరిజ్ఞానమే ఓ విజ్ఞాన భాండాగారం అని మరవొద్ధు సమకాలీన అంశాలపై అవగాహన పెంచాలి.


7️⃣ పాఠ్యపుస్తకం - ప్రామాణికం : పాఠ్యపుస్తకంలో ఉన్న అంశాలపై పట్టు సాధించాలి. ఇవే అంశాలు పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయనే విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివరించాలి.


8️⃣ గురుదేవోభవ : పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు. తల్లిదండ్రుల తర్వాత గురువు స్థానం ఏమిటో వారికి తెలపాలి.


9️⃣ స్నేహాలు - జాగ్రత్తలు : నైపుణ్యం ఉన్న మిత్రులతో తిరిగేలా ప్రోత్సహించాలి. స్నేహితులను బట్టే పిల్లల ఆలోచనా విధానాలు ఉంటాయి.

1️⃣0️⃣ ఆడాలి - గెలవాలి : ఆటలు మనో ధైర్యం కోల్పోకుండా చేస్తాయి. బృంద నైపుణ్యాలు పెరుగుతాయి.


1️⃣1️⃣ నైపుణ్యమే నడిపిస్తుంది : చదువుతో పాటు పోటీ ప్రపంచంలో అదనపు నైపుణ్యం తప్పనిసరి. కళలపై ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహించాలి.


1️⃣2️⃣ నడిపించే నాయకుడు : పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పాఠశాలల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం కావాలి.


1️⃣3️⃣ కొత్తవాటిపై ఆసక్తి : ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. పాఠ్యపుస్తకానికి, లోకజ్ఞానానికి తేడా గుర్తించాలి.


1️⃣4️⃣ లక్ష్యంపైనే గురి : గురువు ఉంటే సరిపోదు గురి ఉండాలి. లక్ష్యసాధన, బరిలోకి దిగడం, గురిచూసి కొట్టడం బాల్యంలోనే నేర్పించాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top