Friday 15 October 2021

AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. వివరాలు ఇలా...

AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. వివరాలు ఇలా...



దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.




ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.

 దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.

ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.

పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.

ముఖ్య సమాచారం :

దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021

దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021

సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021

పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400

పరీక్ష తేదీ : జనవరి 9, 2022

పరీక్ష సమయం ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 180 నిమిషాలు.

అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ www.nta.ac.in

అర్హతలు :

ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సందర్శించాలి.

అనంతరం అధికారిక బ్రౌచర్‌ను పూర్తిగా చదవాలి.

అప్లికేషన్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సరిగా ఇవ్వాలి.

జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.

విద్యార్హత సర్టిఫికెట్‌, క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధిత సర్టిఫికెట్లను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top