Saturday, 16 October 2021

AICTE Scholarship : దివ్యాంగ విద్యార్థులకు AICTE స్కాలర్షిప్... ఏడాదికి రూ.50,000 సాయం.

 AICTE Scholarship : దివ్యాంగ విద్యార్థులకు AICTE స్కాలర్షిప్... ఏడాదికి రూ.50,000 సాయం.




ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా చదువుకు దూరమవుతోన్న దివ్యాంగ (Disabled) విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తోడ్పాటు అందిస్తోంది.

◾దివ్యాంగులను ఉన్నత విద్యలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఏటా ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది.

◾సాక్షం స్కాలర్‌షిప్ స్కీం ద్వారా వీరు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తుంది.

◾సాక్షం స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

◾ఈ విద్యా సంవత్సరానికి (2021-22) గానూ డిప్లొమా లేదా డిగ్రీ కోర్సులను చదివే దివ్యాంగులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

◾ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

◾దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎన్ఎస్‌పీ అధికారిక వెబ్సైట్ https://scholarships.gov.in/ ను సంప్రదించవచ్చు.

నాలుగేళ్ల పాటు ఏటా రూ.50,000 సాయం...

◾ఏఐసీటీఈ ఆమోదించిన విద్యా సంస్థల్లో డిప్లొమా / ఇంజనీరింగ్ ఫస్టియర్ లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు.

◾ఎంపికైన అభ్యర్థులకు ప్రతి ఏటా రూ.50,000 స్టైఫండ్ అందిస్తుంది.

◾ఇంజినీరింగ్ పూర్తయ్యే (నాలుగేళ్ల పాటు) వరకు ఈ స్కాలర్షిప్ను ఇస్తుంది.

◾మొత్తం 1000 మందికి దీని ద్వారా స్కాలర్షిప్ లను అందించనుంది.

◾వీరిలో డిగ్రీ చదువుతున్న వారికి 500, డిప్లొమా వారికి 500 మందికి సాయం చేస్తుంది.

◾ట్యూషన్ ఫీజు కింద రూ.30,000 ఓకేసారి చెల్లిస్తుంది.

◾మిగతావి నెలకు రూ.2,000 చొప్పున 10 నెలల పాటు (మొత్తం రూ.20,000) చెల్లిస్తుంది.

◾27 శాతం ఓబీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది.

మరిన్ని వివరాలు...

◾40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

◾దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8,00,000కు మించరాదు.

◾అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని యాడ్ చేయాలి.

◾దరఖాస్తు చేసుకునే వారు తమ పదో తరగతి / ఇంటర్ / ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కలిగి ఉండాలి.

◾ట్యూషన్ ఫీజు రిసీప్ట్ తప్పనిసరిగా ఉండాలి.

◾ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఫొటోగ్రాఫ్ ఉండాలి.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top