Monday 12 July 2021

నాడు నేడు - మొదటి ఫేజ్, రెండో ఫేజ్ లలో మార్పులు (Nadu Nedu - 1st phase ,2nd phase diffrences)

 నాడు నేడు - మొదటి ఫేజ్, రెండో ఫేజ్ లలో గల మార్పులు (Nadu Nedu - 1st phase ,2nd phase diffrences)




▶️ ఈసారి  సిమెంటు ,  గ్రీన్ బోర్డు మొదలైన వాటితో పాటుగా కరెంటు సామాన్లు , స్విచ్ బోర్డు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, బాత్రూం టైల్స్ ,బాత్ రూమ్ డోర్స్ , విండోస్ మొదలైన ఇతర సామాన్లు అన్నీ  నేరుగా  ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తారు....ఈ సారి విండోస్, డోర్స్ తుప్పు పట్టని stain less steel వి ఇస్తారు.

▶️ నాడు నేడు మొదటి విడతలో లాగా అమౌంట్ చాల నట్లయితే మరో విడత విడుదల చేయు విధానం ఫేస్ -2 నందు ఉండదు.

▶️ కావున ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ వారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయంతో ముందుగానే జాగ్రత్తగా అవసరమైన అన్ని పనులకు ఎస్టిమేషన్ తయారుచేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

▶️ ఇప్పటికే ఉన్నటువంటి స్టేషనరీ కి సంబంధించి గాని రిపేరు చేస్తే ఉపయోగపడే వస్తువులకు సంబంధించి requirement పెట్టకపోవడం మంచిది.

▶️ ముందస్తుగా మనం సబ్మిట్ చేసే input data వివరాలు అత్యంత జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇవ్వబడే నిధులు పూర్తిగా input data పై ఆధారపడి ఉంటాయి.

▶️ విద్యార్థులకు సంబంధించిన డ్యూయల్ డెస్క్ లు మరియు క్లాస్ రూమ్ కు అవసరమైన టేబుల్స్, ఫ్యాన్లు ,ట్యూబ్ లైట్లు , ఇతర సామాగ్రిని కూడా మనకున్న తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండెంట్ రాయాలి. అదనంగా  రాయడం వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది. ▶️ ఈసారి STMS app లాగిన్ ప్రధానోపాధ్యాయులు తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇవ్వబడుతుంది.

▶️ నాడు నేడు కమిటీలో నియమింపబడిన పీసీ కమిటీలోని ఐదుగురు సభ్యులు ఈ వర్క్ పూర్తయ్యేవరకు తప్పనిసరిగా వారే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను మార్చకూడదు.

▶️ నాడు నేడు సంబంధించి  స్కూల్ infrastructure అన్ని ఫోటోలను తీసి  జాగ్రత్త చేసుకోవాలి . ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అని కంపేర్ చేస్తూ ఆ ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

▶️ ఈసారి నాడు నేడు పనుల పరిశీలన ప్రధానోపాధ్యాయుల తోపాటు  ఆ పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులకు బాధ్యత కల్పించడం అయినది .  ప్రతి ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక్కొక్క పనులకు సంబంధించి బాధ్యత వహించవలసి ఉంటుంది.

▶️ మరిన్ని అంశాలు రేపటి ఆన్లైన్ శిక్షణ అనంతరం తెలియజేయబడతాయి.

▶️ మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తిడేటా

▶️ ఏవిధమైన కోడ్ లేకుండా జిల్లా , మండలము , గ్రామము , పాఠశాల పేరును సెలెక్ట్ చేసుకుని నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్ , పనివారు , మొదలైనవి క్రింది లింకుపై క్లిక్ చేసి పరిశీలించవచ్చును..


http://nadunedu.se.ap.gov.in

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top