Wednesday 28 July 2021

INCOME TAX ఈఫైలింగ్ విధానంలో మార్పులు : : సందేహాలు-సమాధానాలు

 INCOME TAX ఈఫైలింగ్ విధానంలో మార్పులు : : సందేహాలు-సమాధానాలు





సందేహం: దాయపన్ను ఈఫైలింగ్ విధానంలో వచ్చిన మార్పులు ఏమిటి ?

సమాధానం: సాధారణంగా జూలై నెల అంటే జీతం ద్వారా ఆదాయం పొందే ఉద్యోగవర్గాలు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసుకునే సమయం.

మామూలుగా అయితే రిటర్న్ ఫైల్ చేయడానికి ఆఖరు తేదీ జూలై 31, 2021. కాని కరోనా ఉధృతి దృష్ట్యా దీన్ని సెప్టెంబరు30,2021 కి పొడిగించారు.

ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం మరియు 2021-22 మదింపు సంవత్సరంకు సంబంధించినది.

సందేహం: రిటర్న్ ఫైల్ చేయడం ఎలా ?

సమాధానం: ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి సులభమైన మార్గం కొత్త ఇన్‌కంటాక్స్‌ పోర్టల్ ద్వారా సమర్పించడం. ఇందులో ఉన్న JSON యుటిలిటిని డౌన్లోడ్ చేసుకొని అందులో ఫారమ్ నింపాలి. ఈ యుటిలిటిలో ఆ వ్యక్తికి సంబంధించి  ముందుగా నింపబడిన (Prefilled) కొంత సమాచారం ఉంటుంది. పన్ను చెల్లింపుదారు సమాచారం సరియైనదని భావిస్తే దానిని నిర్ధారించి (confirm చేసి) ఇతరత్రా ఏదైనా ఆదాయం ఉంటే వెల్లడించాలి.

సందేహం: రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?

సమాధానం: ముఖ్యంగా మీ యొక్క ఆదాయం పూర్తిగా వెల్లడించాలి. వేతనంగా వచ్చే ఆదాయం మాత్రమే కాక బ్యాంకు వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం, షేర్ మార్కెట్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం తదితర వివరాలు వెల్లడించాలి. ప్రస్తుతం ఇలాంటి లావాదేవీలను ఇన్‌కంటాక్స్‌డిపార్ట్మెంట్ వాళ్లు సులభంగా గుర్తించి   నోటీసులు జారీ చేస్తున్నారు.

సందేహం: కొత్త విధానంలో గమనించాల్సిన అంశాలేవి ?

సమాధానం: ఆదాయపన్ను రిటర్న్ లలో వివిధ రకాల ఫామ్స్ ఉన్నాయి. సాధారణంగా వేతన ఆదాయం పొందేవారు ITR-1 లేదా ITR-2 లో రిటర్న్ దాఖలు చేయాలి.ఒక ఇల్లు కలిగి, రూ.50లక్షల వరకు ఆదాయం పొందేవారు ITR-1లో , రెండు లేదా ఎక్కువ ఇల్లు మీద ఆదాయం పొందేవారు ITR-2 ఫారం ఎంచుకోవాలి. పన్నుచెల్లింపుదారులు వారికి సరిపోయే ఫారాన్ని మాత్రమే వాడాలి. ఎందుకంటే IT డిపార్ట్మెంట్ వారు- ఆదాయం అంతా  వెల్లడించినప్పటికీ తప్పుడు ఫారం నింపడాన్ని చెల్లని రిటర్న్ (Invalid Return) గానే పరిగణించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.

సందేహం: రిటర్న్ ఫైల్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే ఏంచేయాలి ?

సమాధానం: కొత్త ఇన్‌కంటాక్స్‌ వెబ్సైట్ వాడటంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి.బి టి ఎ. వాటిని సరిచేయడానికి డిపార్ట్మెంట్ వారు రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నారు.

ఎవరికైనా ఇబ్బంది వస్తే మొదటి సలహా ఏంటంటే ఒకరోజు వేచి చూసి మరొకసారి ప్రయత్నించాలి. అప్పటికి సమస్య అలాగే కొనసాగితే ఇన్‌కంటాక్స్‌ పోర్టల్‌లో సమస్య యొక్క స్వభావం, వివరాలు తెలియజేస్తూ ఫిర్యాదు చెయ్యాలి. వీలైతే స్ర్కీన్‌షాట్ కూడా జతచేయాలి. దీన్ని జాతీయ వెబ్సైట్ డెవలప్‌మెంట్ టీం పరిశీలించి వెంటనే పరిష్కరిస్తుంది.

సందేహం: తప్పు జరిగితే ఎలాంటి జరిమానాలు ఉంటాయి ?

సమాధానం: పూర్తి ఆదాయం వెల్లడించనట్లు నిర్ధారణ అయితే వెల్లడించని ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను పై 50% జరిమానా (Penalty) విధిస్తారు.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆదాయం ప్రకటిస్తే అట్టి ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను పై 200% జరిమానా (Penalty) విధిస్తారు.

చెల్లించాల్సిన పన్ను లక్ష రూపాయలు దాటి జూలై 31,2021లోగా ముందస్తు పన్ను చెల్లించకపోతే వడ్డీ విధించబడుతుంది. 

అయితే ఇన్‌కంటాక్స్‌ వెబ్సైట్ సమస్యలు, కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందుల దృష్ట్యా వడ్డీ విధించడాన్ని వాయిదా వేయాలని వివిధ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top