Monday 12 July 2021

విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ ( 2020-21) - జాతీయ ప్రతిభాన్వేషణా పరీక్ష నందు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల విజయం

విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ ( 2020-21) - జాతీయ ప్రతిభాన్వేషణా పరీక్ష నందు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల విజయం

www.vvm.org.in


జాతీయ స్ధాయిలో ప్రముఖ శాస్త్రవేతలు శ్రీ విజయభట్కర్, శ్రీ అనీల్ కక్కోదర్, శ్రీ మాధవన్ నాయర్ గార్ల మార్గదర్శనంలో రూపొందించబడి, విజ్ఞాన్ ప్రసార్ శాస్ర్తవేత్త శ్రీ అరవింద రనడే జాతీయ కన్వీనర్ గా, కేంద్ర ప్రభుత్వ సంస్ధలైన యన్.సి.ఇ.ఆర్.టి( కేంద్ర ప్రభుత్వ  విద్యా మంత్రిత్వశాఖ)విజ్ఞాన్ ప్రసార్ (కేంద్ర ప్రభుత్వ శాస్ర్త, సాంకేతిక విభాగం)  మరియు విజ్ఞాన భారతి (స్వదేశీ శాస్త్ర, సాంకేతిక ఉద్యమం)ల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుండి 11 (ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం) చదువుచున్న విద్యార్ధులకు ఆన్లైన్ విధానంలో జరిగిన జాతీయ ప్రతిభాన్వేషణా పరీక్ష ‘‘విద్యార్ధి విజ్ఞాన్ మంథన్’’ 2020-21 లోని భాగంగా మే 30, 2021 తేదిన జరిగిన విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ జాతీయ స్ధాయి శిబిరం నందు జాతీయ స్ధాయిలో అన్ని రాష్ట్రాల నుండి పాల్గొన్న 283 మంది విద్యార్ధుల నుండి దక్షిణ భారతదేశ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు విద్యార్ధులు విజేతలుగా నిలిచారని  విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.వి.యల్.ఎన్.శ్రీరామ్ గారు ‌గారు పత్రికా ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారత దేశం స్ధాయిలో విజేతల వివరాలు.

తమన్నా.ఎ..మజీద్, రాజమండ్రి

తమన్నా.ఎ.మజీద్ ద ఫ్యూచర్ కిడ్స్ పబ్లిక్ స్కూల్, రాజమండ్రి నుండి10వ తరగతి లో దక్షిణ భారత దేశంలో ప్రధమ స్థానం పొంది నగదు బహుమతి రు. 5,000/-సర్టిఫికెట్ &  మెమెంటో.


ఆరాధ్య సాహ, విశాఖపట్నం

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం నందు 6వ తరగతి చదువుతున్న ఆరాధ్య సాహ దక్షిణ భారత దేశంలో2వ ర్యాంకు ను పొంది నగదు బహుమతి రు.3,000/- , సర్టిఫికెట్ &  మెమెంటో.


గోరంట్ల సాయి సాహితి , కర్నూలు

నారాయణ ఒలింపియాడ్ స్కూల్, కర్నూలు నందు 8వ తరగతి చదువుతున్న గోరంట్ల సాయి సాహితి దక్షిణ భారత దేశంలో 3వ ర్యాంకు ను సాధించి నగదు బహుమతి రు.2,000/- , సర్టిఫికెట్ &  మెమెంటో సాధించి జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ వెలుగును చాటారు.

విద్యార్ధి విజ్ఞాన్ మంథన్  పరీక్షనందు జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలిచిన విజేతలను విజ్ఞాన భారతి జాతీయ పాలక వర్గ సభ్యులు, భారతీయ విజ్ఞాన మండలి (విజ్ఞాన భారతి-ఆంధ్ర ప్రదేశ్ విభాగం) కో-ఆర్డినేటర్ శ్రీ కె.సుబ్బరాయ శాస్త్రి గారు మరియు అధ్యక్షులు డా.పి.యస్.అవధాని గారు, కార్యదర్శి ప్రాఫెసర్ జి.అర్.కె.శాస్త్రి గారు అభినందించారు.


Press Release of VVM 2020-21


NLC 2020 - 21 RESULTS

ZONAL WINNERS - SOUTH ZONE





NEWS COVERAGE





- PVLN Sriram
State co-ordinator
Vidyarthi Vigyan Manthan
Andhra Pradesh

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top