Friday 18 June 2021

ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు (రామాయణం)

 ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు 



1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్

2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – గంగాసాగర్, వెస్ట్ బెంగాల్.

3. కాంభోజ రాజ్యం – ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు – గోకర్ణ, కర్ణాటక

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్

7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్

8. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.

11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12. తాటక వధ జరిగిన ప్రదేశం – బక్సర్, బీహార్

13. అహల్య శాపవిమోచన స్థలం – అహిరౌలి,బీహార్

14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు – శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

16 దండకారణ్యం – చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు. 17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) – సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – నాసిక్, మహరాష్ట్ర.

19. కబంధాశ్రమం – కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20. శబరి ఆశ్రమం – సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం – హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం – ధనుష్కొటి, తమిళనాడు.

24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25. రత్నద్వీపం / సింహళం / లంక – శ్రీలంక.

26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – దునువిల్ల, శ్రీలంక

28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – దివిరుంపోల, శ్రీలంక.

29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం – ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్.

31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్.

32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్.

33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించెను.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top