Saturday 26 June 2021

మెడికల్ రీయంబర్స్మెంట్ సమాచారం మరియు సంబంధిత ఉత్తర్వులు

 మెడికల్ రీయంబర్స్మెంట్ సమాచారం మరియు సంబంధిత ఉత్తర్వులు




🔘  ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.

CLICK HERE FOR G.O.Ms.No.74, Dated: 15-03-2005


🔘  MLA , MLC లకు రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు మెడికల్ రీయంబర్స్మెంట్ మెంట్ పెంపు.

CLICK HERE FOR G.O.Ms.No.230, Dates: 30-04-2012


🔘  గుర్తింపు లేని హాస్పిటల్లో చికిత్స గురించి

CLICK HERE FOR G.O.Ms.No.597, Dated: 29-09-2010


🔘  జిల్లా స్థాయిలో రూ. 50,000 వరకు వైద్య బిల్లులు చెల్లింపులు.

CLICK HERE FOR G.O.Ms.No.346, Dated: 17-12-2011

🔘  వైద్య ధ్రువీకరణ విధి విధానాలు.

CLICK HERE FOR G.O.Ms.No.31, Dated: 01-12-2009


🔘  అప్రెంటిస్ ఉపాధ్యాయులకు మెడికల్ రీయంబర్స్మెంట్ పొందడం గురించి.

CLICK HERE FOR Memo.No.9542(a)/SE-ser-II-2/2007-2, Dated: 17-11-2008


🔘  ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.

CLICK HERE FOR G.O.Ms.No.397, Dated: 14-11-2008


🔘  కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు. వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి. ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.

CLICK HERE FOR G.O.Ms.No.68, Dated: 28-03-2011


 🔘  కీమోథేరపీ, రేడియోథేరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రులయందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు. 

🔳  కంటి చికిత్స, దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు. కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు. దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.

ఎమర్జన్సీ సర్టిఫికెట్ అవసరం లేదు.

(G.O.Ms.No.276 M&H తేది:11.05.1993)


🔘  రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.


🔘  40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.

CLICK HERE FOR G.O.Ms.No.105, Dated: 09-04-2007


🔘  మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.

CLICK HERE FOR Rc.No.350/D2-4/2008, Dated: 15-04-2008


🔘  కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును. అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.

CLICK HERE FOR G.O.Ms.No.87, Dated: 28-02-2004


🔘  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.

CLICK HERE FOR G.O.Ms.No.601, Dated: 15-10-2003


హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.


🔘  రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No.8878/(D3-4)MBI-12010 Dated:12-10-2010 ద్వారా వివరించారు.

CLICK HERE FOR Rc.No.8878/(D3-4)MBI-12010, Dated: 12-10-2010

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top