ఇమ్యూనిటీ తగ్గిందని.. ఈ లక్షణాలతో గుర్తించండి..!
కరోనా తర్వాతే... శరీరంలో ఇమ్యూనిటిని పెంచుకోవాలని అవగాహన వచ్చింది. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ.. తమ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం గురించి గూగుల్, యూట్యూబ్‌లలో సెర్చ్ చేస్తున్నారు. కంటి నిండా నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. వారిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ వైరస్ ఇమ్యూనిటీ లేని వారిపైనే పంజా విసురుతోంది. అయితే, మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా మన ఇమ్యూనిటీ పవర్‌ను అంచనా వేయొచ్చు. మరి ఆ లక్షణాలేంటో తెలుసుకోండి.
రోగనిరోధక శక్తి గురించి కొన్ని విషయాలు:
వైరస్, బాక్టీరియా, ఫంగల్, ప్రోటోజోవాన్ దాడుల నుంచి మన శరీరాన్ని రక్షించేదే మన ఇచ్యూనిటీ. ఇది మన శరీరంపై దాడి చేసే ప్రాణాంతక వ్యాధికారకాల నుంచి రక్షన కవచంలా కాపాడుతుంది. అయితే, కొన్నిసార్లు వైరస్‌లు ఇమ్యూనిటీ ఉన్న వరిపూ కూడా అటాక్ చేస్తాయి. అయితే అలాంటి టైంలో రోగనిరోధక వ్యవస్థ హానికరమైన వ్యాధికారకాలను గుర్తించి వాటిపై అటాక్ చేస్తుంది. అయితే మీరు తరచుగా అనారోగ్యానికి గురైనా లేదా అలసిపోయినట్లుగా అనిపిస్తున్నా.. మీ ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని గుర్తించాలి. ముఖ్యంగా ఈ కింది 6 విషయాలను గమనించండి.
జీర్ణ సమస్యలు పెరగడం
మన ఇమ్యూనిటీ వ్యవస్థ 70 శాతం మన పేగుల్లోనే ఉంటుంది. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాతో ఇది నిరంతరం పోరాడుతుంది. పేగుల్లో ఉండే బ్యాక్టరియా టి-కణాలు లేదా సైనిక కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఫలితంగా విరేచనాలు, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఎలా పరిష్కారించాలి .. ?
మన రోగనిరోధక శక్తి మనం తీసుకునే ఆహారం, డ్రింక్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా ప్రాసెస్ చేసిన, కృత్రిమ చక్కెర వంటివి ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తాయి. కాబట్టి.. ఫైబర్, ప్రోటీన్, పోషకాలు కలిగిన ఫూడ్ ను మాత్రమే తీసుకోవాలి.
గాయాలు లేటుగా మానడం:
మనకు దెబ్బలు తాకి గాయాలైన, అంటు వ్యాధులు వచ్చినా రోగ నిరోధక శక్తి వెంటనే స్పందిస్తుంది. ఆ గాయాల మీద కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ఒక వేల శరీరంలో రోగనిరోదక శక్తి తగ్గినట్లయితే గాయాలు తొందరగా మానవు.
ఎలా పరిష్కారించాలి .. ?
మీ రక్తంలోని రోగనిరోధక వ్యవస్థ మీ గాయాలను రక్షించడానికి, నష్టాన్ని నియంత్రించడానికి, కొత్త కణాల పునరుత్పత్తికి దోహదం చేస్తుంది. కాబట్టి.. విటమిన్-డి, సి, జింక్ సమతుల్య స్థాయిలో తీసుకుంటే.. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. గాయాలు త్వరగా నయమవుతాయి. మీ గాయానికి కట్టుకట్టి ఉంచండి. వెచ్చదనం వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి. గాయాన్ని గాలికి వదిలేస్తే స్యూక్ష్మజీవులు పెరిగి వైద్యం మరింత క్లిష్టం కావచ్చు.
విపరీతమైన అలసట:
బాగా నిద్రపోయినా.. మీలో అలసట ఎక్కువగా ఉన్నట్లనిపిస్తే ఖచ్చితంగా మీలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని గుర్తించాలి. రోగ కారకాలతో పోరాడేందుకు రోగనిరోధక శక్తి శరీరంలోని శక్తిని ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది. అందువల్లే అలసట కలుగుతుంది.
ఆందోళన , ఒత్తిడి:
మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ శరీరం కార్టికోస్టెరాయిడ్స్‌ను విడుదల చేస్తుంది. ఇది మన శరీరంలోని లింఫోసైట్‌ల సంఖ్యను తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తుంది. ఈ పరిస్థితి దూమపానం, మద్యపానానికి ప్రేరేపిస్తుంది. ఈ అలవాట్లు రోగనిరోధక శక్తిని మరింత దెబ్బతీస్తాయి. కాబట్టి.. ఆందోళన, ఒత్తిడి సమస్యలు దూరంగా ఉండాలి.
0 Post a Comment:
Post a Comment