Saturday 5 June 2021

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2021 - కేంద్ర ప్రభుత్వం విద్య శాఖ సెప్టెంబర్ 05, 2021ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని దేశం లోని ఉపాద్యాయులు నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం నామినేషన్ లు స్వీకరిస్తుంది.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2021 - కేంద్ర ప్రభుత్వం విద్య శాఖ సెప్టెంబర్ 05, 2021ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని  దేశం లోని ఉపాద్యాయులు నుండి  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం నామినేషన్ లు స్వీకరిస్తుంది.



అర్హతలు :

✍️రాష్ట్ర ప్రభుత్వ , & స్థానిక సంస్థల పరిధిలోని ప్రైమరీ , అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్ లలో పనిచేసే ఉపాద్యాయులు


✍️ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నవోదయ , కేంద్రీయ విద్యాలయం & CBSE అనుబంధ పాఠశాలల్లో పనిచేసే ఉపాద్యాయులు


 ✍️ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఏక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) 


✍️ సాధారణంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు ఈ అవార్డుకు అర్హులు కారు.

కానీ...

 క్యాలెండర్ సంవత్సరంలో కొంత భాగం పనిచేసిన ఉపాధ్యాయులు (కనీసం నాలుగు నెలలు అంటే జాతీయ అవార్డులకు సంబంధించిన సంవత్సరంలో ఏప్రిల్ 30 వరకు) వారు అన్ని ఇతర షరతులను నెరవేర్చినట్లయితే పరిగణించవచ్చు. అనర్హతలు : 

✍️ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ అర్హులు కారు


✍️ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణా సంస్థల సిబ్బంది ఈ అవార్డులకు అర్హులు కాదు.


✍️ఉపాధ్యాయుడు / ప్రధానోపాధ్యాయులు ట్యూషన్లలో పాల్గొనకూడదు. రెగ్యులర్ ఉపాధ్యాయులు మరియు హెడ్మాస్టర్ లు  మాత్రమే అర్హులు. కాంట్రాక్టు ఉపాధ్యాయులు మరియు శిక్షా మిత్రాస్  అర్హులు కారు

అప్లికేషన్ విధానం : 

https://nationalawardstoteachers.education.gov.in/

వెబ్సైట్ లో  అర్హత కలిగిన ఉపాద్యాయులు & హెడ్మాస్టర్ లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించి , అప్లికేషన్ ప్రింట్ కాపీ తో పాటుగా సంబంధిత ఆధారాలు ( ఫోటోలు, వార్తా పత్రిక క్లిపింగ్ లు , ఆడియో & వీడియో లు)  అప్లికేషన్ కు జత చేసి రెండు కాపీ లు జిల్లా విద్యాధికారి కార్యాలయం లో అందజేయాలి


వెబ్సైట్  01.06.2021 నుండి 20.06.2021 వరకు అందుబాటులో ఉంటుంది


సెలక్షన్ విధానం : 

ప్రతి జిల్లా నుండి  జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ముగ్గురిని రాష్ట్ర సెలక్షన్ కమిటీ కి పంపిస్తారు. ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్ర సెలక్షన్ కమిటీలు ఎంపిక చేసిన ఆరుగురిని కేంద్రానికి పంపిస్తారు అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన  సెలెక్టెడ్ ఉపాధ్యాయుల నుండి మొత్తంగా 45 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపిక చేస్తారు. వీరికి సెప్టెంబర్ 05 న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top