వేర్వేరు టీకా డోసులు వేసేందుకు కేంద్రం కసరత్తు
✳️ దేశంలో ఇప్పుడు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న వాటిని బట్టి టీకాలు వేస్తున్నారు. అయితే, తొలుత ఏ సంస్థ టీకా వేసుకుంటే రెండో డోసు కూడా అదే వేయించుకోవాలన్న నియమం ఉంది.
✳️ దీంతోపాటుగా కొవిషీల్డ్ టీకాను ఒకే డోసుతో సరిపెట్టాలన్న యోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. వేర్వేరు డోసుల విధానంపై మరో నెల రోజుల్లో ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. గరిష్టంగా రెండున్నర నెలల్లో దీనిపై ట్రయల్స్ ముగిస్తారని, ఆ తర్వాత కొవిషీల్డ్ సింగిల్ డోస్‌పై ట్రయల్స్ మొదలవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ✳️రెండు వేర్వేరు టీకా డోసులను ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాలను నమోదు చేసేందుకు ఓ యాప్‌ను తయారు చేసి దానిని కొవిన్ యాప్‌తో అనుసంధానం చేస్తారని తెలుస్తోంది. ఫలితంగా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకున్న వారు తమకు ఎదురయ్యే సమస్యలను అందులో నమోదు చేయడం ద్వారా నిపుణుల దృష్టికి ఆ విషయాలు చేరుతాయని చెబుతున్నారు.
✳️మరోవైపు, కొవిషీల్డ్ టీకా తొలి డోసు తీసుకున్న వారిలోనూ మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్టు ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో సింగిల్ షాట్‌పైనా ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సింగిల్ షాట్ టీకాలైన ‘స్పుత్నిక్ లైట్’, ‘జాన్సన్ అండ్ జాన్సన్’ టీకాలు కూడా కొవిషీల్డ్ ఫార్ములా ఆధారంగా తయారైనవే. కాబట్టి కొవిషీల్డ్ సింగిల్ డోస్ టీకాపై ట్రయల్స్ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
0 Post a Comment:
Post a Comment