Thursday 6 May 2021

కారోనాను జయించేందుకు కొత్త పద్దతి. డి-ల్యాంప్` విధానంతో ఇంట్లోనే వైరస్‌కు చెక్...?

కారోనాను జయించేందుకు కొత్త పద్దతి. డి-ల్యాంప్` విధానంతో ఇంట్లోనే వైరస్‌కు చెక్...?క‌రోనా రెండో ద‌శ‌ ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి బారిన పడకుండా తమను తాము కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రజలు. ఈ క్రమంలో కొవిడ్‌-19ను నిరోధించే పద్ధతులపై కొందరు నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి కొత్త పద్ధతిని కనిపెట్టానని చెబుతున్నారు బిహార్‌కు చెందిన ఒక డాక్టర్. పాట్నా ఆల్ ఇండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో డిప్యూటీ మెడిక‌ల్ సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ అనిల్ కుమార్ డి- ల్యాంప్‌ (D-LAMP) అనే కొత్త పద్ధతికి అంకురార్ప‌ణ చేశారు. దీని ద్వారా 6,000 మందికి పైగా కొవిడ్ వ్యాధిగ్ర‌స్థులు ఏ హాస్పిట‌ల్‌కూ వెళ్ల‌కుండా ఇంటి వ‌ద్ద‌నే క‌రోనాను జయించినట్లు చెబుతున్నారు. ఈ కాన్సెప్ట్‌ను పాటించేవారు ఆసుపత్రుల్లో రూ.ల‌క్ష‌లు ఖర్చు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా, ఇంట్లోనే ఉండి వైర‌స్ ప్ర‌భావాన్ని తగ్గించుకోవచ్చని ఆయన వెల్లడించారు.

ఎయిమ్స్ టెలీమెడిసిన్ కోఆర్డినేట‌ర్ దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. కోవిడ్‌-19 గురించి తెలుసుకోవ‌డానికి ఎక్కువ‌గా రాజ‌స్థాన్‌, ఝార్ఖండ్‌, ఢిల్లీ, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, బిహార్ రాష్ట్రాల నుంచి ప్ర‌తిరోజూ పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఫోన్ కాల్స్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా డి-ల్యాంప్ కాన్సెప్ట్‌ని మ‌రింత ప్ర‌చారం చేయాల‌ని వైద్యులు నిర్ణ‌యించారు.

డి-ల్యాంప్ అంటే ఎంటి...?

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా సోకిన వారికి వైద్యం అందించ‌డం క‌ష్టంగా మారింది. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో కొవిడ్-19 సోకిన వ్య‌క్తి వెంట‌నే డి-ల్యాంప్ కాన్సెప్ట్ ఆధారంగా మందులు తీసుకోవాలని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

డి-ల్యాంప్ అనేది `డి, ఎల్‌, ఏ, ఎమ్‌, పి` అక్ష‌రాల‌తో సంక్షిప్త రూపంలో ఉన్న చికిత్స ప‌ద్ధ‌తి. ఇందులో `డి` అంటే డెక్సామెథ‌సోన్‌, `ఎల్‌` అంటే లో మాలిక్యుల‌ర్ వెయిట్ హెప‌రిన్ ఇంజెక్ష‌న్ లేదా ఎపిక్సాబెన్ టాబ్లెట్‌. `ఏ` అంటే అజిత్రోమైసిన్ మాత్ర‌. `ఎమ్` అంటే మాంటేలుకాస్ట్ అండ్ లివోసిట్రిజిన్ మాత్ర‌. ఇక చివ‌రిగా `పి` అంటే పారాసిట‌మ‌ల్ ట్యాబ్లెట్‌. ఈ మందులు ఉప‌యోగించ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ సోకిన‌వారు కొన్ని రోజుల్లోనే కోలుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు ఎయిమ్స్ వైద్యులు.

కరోనా బారిన పడకుంగా కాపాడుకోవడానికి ‘ఎమ్ 3 పిహెచ్‌సి’ (M 3 PHC) అనే పద్ధతిని పాటించాలని పాట్నా ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. M3 అంటే.. మాస్క్‌, మ‌ల్టీవిట‌మిన్‌, మౌత్ గార్గిల్‌(పుక్కిలించడం). అంద‌రూ మాస్క్ పెట్టుకోవాలి. పుక్కిలించడం ద్వారా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోడానికి మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్‌లు వాడాలి. PHCలో.. `పి` అంటే కావాల్సినంత ఆక్సిజ‌న్ గ్ర‌హించ‌డానికి అనువుగా ఉండేట‌ట్లు ప్రోనింగ్ పద్ధతిలో ప‌డుకోవాలి. `హెచ్‌` అంటే హ్యాండ్ వాష్‌ (చేతులు క‌డుక్కోవ‌డం). `సి` అంటే చెస్ట్ ఫిజియోథెర‌పీ లేదా ఛాతి వ్యాయామానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం. ఈ పద్ధతుల ద్వారా కరోనా మహమ్మారిని సులభంగా జయించవచ్చని డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top