కరోనా వ్యాక్సినేషన్‌పై కొన్ని సందేహాలు, సమాధానాలు - నిమ్స్ ఫార్మకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి.
కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రజలకు ఎన్నో సందేహాలున్నాయి. ఏ చేతికి వ్యాక్సిన్ వేయించుకోవాలి? ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు, గర్భవతులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? ఇలాంటి అనేక సందేహాలను నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఫార్మకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి నివృత్తి చేశారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సందేహాలకు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు.
🔆 ఏ చేతికి వ్యాక్సిన్ వేయించుకోవాలి?
🔆 ఎలాంటి మందులువాడేవారు వ్యాక్సిన్ తీసుకోకూడదు?
ఇమ్యునోసప్రెసెంట్స్, స్టెరాయిడ్స్, హెచ్‌ఐవీకి మందులు వాడుతున్నవారు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. స్టెరాయిడ్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో నోటి ద్వారా, ఇంజెక్షన్‌ల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ వాడుతున్నవారు టీకాకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ వేయించుకున్నా ఉపయోగం ఉండదు. వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి కావు. అలర్జీ ఉన్నవాళ్లు స్టెరాయిడ్స్ వాడుతుంటే టీకా తీసుకోకూడదు.
🔆 ఇమ్యునోసప్రెసెంట్స్, స్టెరాయిడ్స్ మందులు కొద్దిరోజులు ఆపేసి వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?
తమకు మందులు సూచించిన వైద్యున్ని సంప్రందించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇమ్యునోసప్రెసెంట్స్, స్టెరాయిడ్స్ ఆపేస్తే చికిత్సలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
🔆 టీకా తీసుకునేముందు కరోనా టెస్ట్ చేయించుకోవాలా?
అవసరం లేదు. వైరస్ లక్షణాలు లేన్నప్పుడు, ఇంటిలో ఎవరూ పాజిటివ్ కానప్పుడు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిర్భయంగా టీకా వేసుకోవచ్చు.
🔆 కరోనా వచ్చినవారు వ్యాక్సిన్ వేసుకుంటే అపాయమా?*
ఎలాంటి అపాయం లేదు. ఆందోళన అవసరం లేదు.
🔆 వ్యాక్సినేషన్ తర్వాత పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తుందా? వారిలో వైరస్ లక్షణాలు ఉంటాయా?
అది తప్పు. కేవలం అపోహ మాత్రమే. అలా అయితే అందరికీ వైరస్ సోకే ముప్పు ఉంటుంది కదా? టీకా వేసుకోవడానికి ముందుగానీ, తర్వాతగానీ శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తే పాజిటివ్‌గా తేలుతుంది. వ్యాక్సినేషన్ వల్ల పాజిటివ్ రాదు. ఇతరుల ద్వారా వైరస్ సోకితేనే వస్తుంది.
🔆 వ్యాక్సినేషన్ ఏ చేతికి వేసుకోవాలి?*
సాధారణంగా టీకాలు ఎక్కువగా ఎడమ చేతికి వేస్తారు. కుడి చేతికి వేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
🔆 బ్లడ్ థిన్నర్ (రక్తం పల్చగా అవడానికి) మందులు వాడేవారు వ్యాక్సిన్ తీసుకుంటే ఇబ్బందులుంటాయా?
వ్యాక్సిన్ వల్ల వారికి ఎలాంటి ముప్పు ఉండదు. మేం నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం పరిశీలించాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
🔆 మొదటి డోసు తర్వాత నిర్ణీత గడువు దాటితే ఫర్వాలేదా?
నిర్ణయించిన గడువు దాటిన తర్వాత వారం, పది రోజుల్లోపు రెండో డోసు వేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. వారంలోగా వేసుకోవడానికి ప్రయత్నించాలి.
🔆 మొదటి డోసులో ఒక కంపెనీకి చెందిన వ్యాక్సిన్, రెండో డోసులో అది దొరక్కపోతే వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకోవద్దు. అది సరికాదు. మొదటి డోసుగా వేసుకున్న వ్యాక్సిన్‌నే మళ్లీ రెండో డోసుగా వేసుకోవాలి.
🔆 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రుద్దడం, వేడినీళ్లు, ఐస్ పెట్టి కాపడం చేయొచ్చా?
అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. దాన్ని అలా వదిలేయాలి. జ్వరం, తలనొప్పి, నీరసం, ఇంజెక్షన్ వేసిన చోట కొద్దిగా నొప్పి ఉంటాయి. బాగా నొప్పి అనిపిస్తే డోలో లేదా పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది.
🔆 టీకా తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
టీకాకు ముందు, తర్వాత కనీసం రెండు, మూడు రోజులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
🔆 ఏ వయసు వారు, ఎవరెవరు టీకా వేసుకోవచ్చు?
ప్రస్తుతం 45 ఏళ్లు దాటినవారికి టీకా వేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చు. గర్భవతులకు టీకాలు నిషిద్ధం. మానసిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయించకపోవడం మంచిది.
🔆 జ్వరం వచ్చినప్పుడు రెండో డోసు వేసుకోవచ్చా?
జ్వరం తగ్గాక రెండు, మూడు రోజులు ఆగి వేసుకోవాలి. ఒకటి రెండు రోజులు వ్యాక్సిన్ ఆలస్యమైనా ఏమీ కాదు.
🔆 కరోనా వచ్చి తగ్గిపోయినవారు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు?
ఇలాంటివారు కరోనా నయమైన ఒకట్రెండు నెలల తర్వాత ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
Most imp. & valuable inf.
ReplyDeleteTnq sir