Thursday 15 April 2021

కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర - కాయకష్టం ఇదే కరోనా కట్టడికి దివ్యౌషధం

 కడుపు నిండా తిండి,కంటి నిండా నిద్ర-కాయకష్టం ఇదే కరోనా కట్టడికి దివ్యౌషధం





🛑 శారీరీక శ్ర‌మ వ్యాయామం లేని వారే కరోనాతో బలి



🔹 మీరు రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేస్తున్నారా.

🔹 రెండేళ్ల నుంచి వ్యాయామం అస‌లే అల‌వాటు లేనివాళ్లను కోవిడ్ బ‌లి తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

🔹 క‌ద‌లిక‌లేని జీవితాన్ని గ‌డుపుతున్న‌వారిలోనే క‌రోనా తిష్ట‌వేస్తున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

🔹 శారీరీక శ్ర‌మ లేని వారిలో ఎక్కువ శాతం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు తేల్చారు.

🔹 వారిలోనే మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని అధ్య‌య‌నం ద్వారా వెల్ల‌డించారు.

🔹 సుమారు 50 వేల మంది వైర‌స్ బాధితుల‌ను స్ట‌డీ చేసిన త‌ర్వాత ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

🔹 మ‌హ‌మ్మారి క‌న్నా రెండేళ్ల ముందు నుంచి ఎటువంటి శారీరక శ్ర‌మ‌, వ్యాయామం అల‌వాటు లేని వారు ఎక్కువ శాతం హాస్పిట‌ల్‌లో చేరుతున్న‌ట్లు స్పోర్ట్స్ మెడిసిన్ బ్రిటీష్ జ‌ర్న‌ల్ ప‌రిశోధ‌కులు త‌మ నివేదిక‌లో పేర్కొన్నారు.

🔹 కోవిడ్ వ్యాధి సీరియ‌స్‌గా ఉందంటే వారు వ్యాయామానికి నడకకి దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు.

🔹శారీర‌క శ్ర‌మ లేని ముస‌లివాళ్లు,అవ‌య‌వ మార్పిడి చేసుకున్న‌వాళ్ల‌లోనూ కోవిడ్ విష‌మ స్థాయిలో విజృంభిస్తోంద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు.

🔹 ధూమ‌పానం, ఊబ‌కాయం,హైబీపీ క‌న్నా శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డ‌మే అతిపెద్ద రిస్క్ ఫ్యాక్ట‌ర్ అని సైంటిస్టులు తెలిపారు

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top