Tuesday 20 April 2021

ఇంటిలో, ఆఫీసులో ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

 ఇంటిలో, ఆఫీసులో ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?
    దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంట్లో, ఆఫీసులో ఇతర ప్రదేశాల్లోనో స్నేహితులు, ఇతరులతో దగ్గరగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఇంటిలో, ఆఫీసులో ఎవరైనా ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే, మిగతా వారు ఏమి చేయాలి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన సహచరుడికి కరోనా వచ్చిందని తెలియగానే మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

👉  కరోనా వచ్చిన వ్యక్తితో పది రోజులలో పు కలిసిన వారందరూ సదరు వ్యక్తికి ప్రైమరీ కాంటాక్టుగా భావించాలి. అంటే మనకు కూడా కరోనా ఉందనే భావించి, వెంటనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. (మనం కరోనా పరీక్ష చేయించుకుని వైరస్ లేదని నిర్థారణ అయ్యేవరకూ)..

👉  వైరస్ లక్షణాలు ఏమీ లేనట్టయితే.. "కరోనా వచ్చిన వారికి జబ్బు లక్షణాలు మొదలయిన ఐదో రోజు (Incubation period) తరువాత" ఆయనతో గత పదిరోజుల్లో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకోవాలి.

👉 ఒకవేళ మనకు ఏమైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, అవి ఏరోజు మొదలయితే ఆరోజే పరీక్ష చేయించుకోవాలి.

👉  ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే, తమతో సన్నిహితంగా ఉన్నవారిలో ఎవరికైనా కరోనా వస్తే, తమకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే.. ఐదు రోజులు లేదా వైరస్ లక్షణాలు వచ్చేదాకా ఆగకుండా"  ఈలోపే పరీక్ష చేయించుకుంటున్నారు. అందులో నెగటివ్ వస్తే ఇక మనకు కరోనా రాలేదు అనుకుని మాములుగా తిరిగేస్తున్నారు. 

✔  ఇక్కడ రెండు పొరపాట్లు చేస్తున్నారు..

1) చేయించుకోవాల్సిన సమయం కన్నా ముందే పరీక్ష చేయించుకొని, మనకి వైరస్ ఉన్నా నెగటివ్ రిపోర్టు తెచ్చుకోవడం

2) ఈ ఐదు రోజులు అందరికీ దూరంగా ఉండకుండా కరోనా లక్షణాలు రాలేదనుకొని అందరితో సన్నిహితంగా ఉండి, దగ్గర వారందరికి కరోనా వ్యాప్తి చేయడం.

👉  పై రెండు విషయాలు ప్రతిఒక్కరూ బాగా గుర్తు పెట్టుకోవాలి. గత పది రోజుల్లో మనం సన్నిహితంగా ఉన్న వారిలో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలియగానే, మనం వెంటనే మన దగ్గర వారందరికీ దూరంగా (Isolation) ఉండాలి (టెస్టు చేయించుకొని, ఆ రిపోర్టు నెగటివ్ వచ్చే వరకూ).

✔  ఏ పరీక్ష చేయించుకోవాలి?

👉  RTPCR లేదా RAPID ANTIGEN TEST. (ముక్కు నుండి శాంపిల్ బాగా తీస్తే, ఏదైనా ఒకటే! - ఏది అందుబాటులో ఉంటే, అది చేయించుకోండి)

👉  చాలా మంది వారి ఇంటికి దగ్గరలో మంచి ల్యాబు ఉన్నా సరే.. ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకోమని ఫోను చేసి కోరుతున్నారు. అది మంచి పద్దతి కాదు. ఇంటి దగ్గరకు వచ్చి శాంపిల్ తీసేవారి కన్నా, ల్యాబ్ లో ఎక్కువ నైపుణ్యం ఉన్న సీనియర్ టెక్నీషియన్లు ఉంటారు..

👉  అంతేకాకుండా ఇంటి దగ్గర శాంపిల్ తీసేవారు మిగతా వాళ్ల ఇంటికి తిరుగుతూ ఎప్పటికో మీ దగ్గరకు వస్తారు. ఆ తీసిన శాంపిల్ కూడా వెంటనే కాకుండా ఎప్పటికో ల్యాబ్ లో ఇస్తాడు. దీనివల్ల పరీక్షల్లో తప్పుడు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలయినంత వరకూ నెట్ ద్వారా మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు టెస్టింగ్ సెంటరు ఎక్కడుందో తెలుసుకొని, మీరే అక్కడకు వెళ్లి శాంపిల్ ఇవ్వడం మంచిది. 

👉  శాంపిల్ తీసేటప్పుడు, కొంచెం ఇబ్బందయినా టెక్నీషియన్ కు సహకరించి..వారి ముక్కు లోపల బాగం నుండి నిదానంగా రెండు నిమిషాలు రొటేట్ చేసి, ప్రెస్ చేసి మంచి శాంపిల్ తీసుకునేలా సహకరించాలి. 

👉  కొంతమంది పేషెంట్లు టెక్నీషియన్లకి సహకరించకుండా ఇబ్బంది పెట్టి మంచి శాంపిల్ తీయనీవడం లేదు. ముక్కు ముందు బాగం నుండి పైపైనే శాంపిల్ తీయించుకోవడం వలన మనకే  నష్టం. కనుక, టెక్నీషియన్లకి సహకరించినట్టయితే మనకే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది.

👉  కరోనా జబ్బు లక్షణాలు మొదలైన వెంటనే, ముక్కు స్వాబ్ పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష చేయించుకోవడం లేటయ్యేకొద్దీ, జబ్బు ఉన్నా రిపోర్టు నెగటివ్ రావచ్చు. ఒక వారం ఆలస్యం చేస్తే, ఆ సమయంలో మనకు తీవ్రమైన కరోనా ఉన్నా రిపోర్టులో ఒక్కోసారి నెగటివ్ రావొచ్చు.

👉  ఆక్సిజన్ శాతం తగ్గుతున్నా.. దగ్గు, ఆయాసం ఉన్నా డాక్టర్ సలహా మేరకు డైరెక్ట్ గా చాతి సిటీ స్కాన్ చేయించుకుని కరోనా వుందా / లేదా అని నిర్ధారించుకొండి.డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా 

ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ అధికారి

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top