మాస్క్ ధరించకపోతే జరిమానా - అధికారులకు సీఎం జగన్ ఆదేశం
👉 మాస్క్ ధరించకపోతే జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
👉 ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రూ.100 జరిమానా విధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
👉 1నుంచి 9 తరగతులకు సెలవులు ప్రకటించామని.. హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు సైతం మూసివేయాలన్నారు.
👉 ఫంక్షన్ హాళ్లలో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం. థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జగన్ స్పష్టం చేశారు.
0 Post a Comment:
Post a Comment