Thursday 15 April 2021

ఫోన్ చేసిన 3 గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ కేటాయించాలి : సీఎం జగన్

 ఫోన్ చేసిన 3 గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ కేటాయించాలి : సీఎం జగన్

🌺 ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగికి బెడ్స్ కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

🌺 గురువారం నాడు కరోనాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

🌺 ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలన్నారు.

🌺 హోంఐసోలేషన్ లో ఉన్నవారిని ఫాలో అప్ చేయాలని అధికారులకు సూచించారు.

🌺 రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కు అవసరమైన వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు గాను కేంద్రానికి లేఖ రాయాలని ఆయన అధికారులను కోరారు.

🌺 ప్రస్తుతం అధికారులు ఏ స్పూర్తితో పనిచేస్తున్నారో అదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు.

🌺 రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు

🌺 గ్రీవెన్స్ కోసం 1902, కోవిడ్ సేవల కోసం 104 సేవల నెంబర్ కేటాయించాలని ఆయన సూచించారు.

🌺 ఈ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.

🌺 కరోనా రోగులకు చికిత్స అందిస్తే ఎంత ఫీజు వసూలు చేస్తారో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

🌺 ప్రభుత్వం నిర్ధేశించిన పీజు కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

🌺 మందులు, ఇంజక్షన్ల ధరలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top