Monday 25 January 2021

e-EPIC కార్డుకు సంభందించిన సమాచారం

 e-EPIC కార్డుకు సంభందించిన సమాచారం 



👉 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ e-EPIC అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీ ఓటర్ ఐడీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్‌లోడ్ చేయొచ్చు.

👉 ఫిబ్రవరి 1 నుంచి డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ డిజిటల్ ఓటర్ ఐడీ చూపించి ఎన్నికల్లో ఓటు కూడా వేయొచ్చు. అంటే ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

✔ ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ e-EPIC అంటే డిజిటల్ ఓటర్ ఐడీకి సంబంధించి ఓటర్లలో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ 12 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.


1. e-EPIC అంటే ఏంటీ?

e-EPIC ఐడీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ల్యామినేట్ కూడా చేయొచ్చు. డిజీలాకర్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం జారీ చేస్తున్న పీవీసీ ఓటర్ ఐడీ కార్డుకు అదనంగా e-EPIC సర్వీస్ ప్రారంభమైంది.


2. e-EPIC ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

ఓటర్ పోర్టల్ http://voterportal.eci.gov.in/ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ లేదా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ లో డౌన్‌లోడ్ చేయొచ్చు.


3. e-EPIC ఎవరు తీసుకోవచ్చు?

కొత్తగా ఓటర్‌గా నమోదు చేసుకున్నవారు ఎవరైనా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2021 అంటే 2020 నవంబర్, డిసెంబర్‌లో అప్లై చేసినవారు e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇక ఇతర ఓటర్లు 2021 ఫిబ్రవరి 1 నుంచి e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు.


4. ఓటర్ ఐడీ నెంబర్ తెలియకపోయినా e-EPIC ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్స్‌లో మీ పేరు సెర్చ్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు.

5. ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చా?

అవును. ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్ ఉపయోగించి e-EPIC డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్.


6. E-EPIC ఫైల్ సైజ్ ఎంత?

కేవలం 250 కేబీ మాత్రమే.


7. E-EPIC ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించొచ్చా?

e-EPIC డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించొచ్చు.


8. E-EPIC ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా Voter Helpline Mobile App ప్లాట్‌ఫామ్స్ ద్వారా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే e-KYC పూర్తి చేయాలి.

9. e-KYC అంటే ఏంటీ?

మీ ఫోటో క్యాప్చర్ చేసి EPIC డేటాతో కంపేర్ చేస్తారు.


10. e-KYC ఫెయిల్ అయితే?

ఈఆర్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఫోటో ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి.


11. e-KYC చేయాలంటే ఏం కావాలి?

మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో ఏదైనా ఒకటి ఉంటే చాలి. కెమెరా లేదా వెబ్‌క్యామ్ తప్పనిసరి.


12. మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేకపోతే?

e-KYC ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తైన తర్వాతే డౌన్‌లోడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించొచ్చు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top