నిష్ఠ శిక్షణ పై అవగాహన కొరకు
1. ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయురాలు ఖచ్చితంగా శిక్షణ తీసుకునే విధంగా మండల విద్యాశాఖాధికారులకు మరియు SRG లకు ఆదేశాలు జారీ చేయాలి.
2. 5 రోజులు కోర్స్ ని ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం follow అయ్యేటట్లు సూచనలు జారీ చేయాలి.
3. ఉపాధ్యాయులు మొదటగా కంటెంట్ ని అవగాహన చేసుకోవాలి. అంతే కాకుండా ఆన్లైన్ లో ఇచ్చిన అదనపు స్టడీ మెటీరియల్ ను, సంబంధిత లింక్ లను కూడా స్టడీ చేయాలి.
4. ప్రతీ కోర్స్ అయ్యే లోపల ఇస్తున్న చిన్ని చిన్ని టెస్ట్ లు, అసెస్మెంట్ లను పూర్తి చేయాలి.
5. ఒక module ని రోజంతా చదవకుండా ఒక నిర్దేశపు సమయంలో మాత్రమే పూర్తి చేయమని ఉపాధ్యాయులుకు తెలియచేయాలి.
6. Chrome latest browser లో మాత్రమే శిక్షణ తీసుకుంటే hang అవ్వదు. కావున browser ని అప్డేట్ చేయమని చెప్పాలి.
7. I phone లో ఈ app అవ్వదు కావున website ద్వారా DIKSHA లాగిన్ చేసుకొని follow అవ్వవచ్చు. 8. Password మర్చిపోతే forget password ద్వారా లాగిన్ అవ్వమని చెప్పాలి. మర్చిపోతే జిల్లా కోఆర్డినేటర్ ల ద్వారా సంబంధిత టీచర్ల యొక్క లాగిన్ పాస్వర్డ్ పొందవచ్చు.
9.Java కోర్స్ లోకి వెళ్లి AP- లేక రాష్ట్ర కార్యాలయం నుండి ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే లాగిన్ అయినట్లే అని, తద్వారా శిక్షణ తీసుకోమని టీచర్స్ కి facilitate చేయమని SRGs కి చెప్పాలి. రాష్ట్ర కార్యాలయం నుండి live link కూడా ఇవ్వబడుతుంది కావున ప్రతీ ఉపాధ్యాయులు సాయంత్రం 6-7 గంటల వరకు యూట్యూబ్ లో లైవ్ మాత్రమే ఫాలో అవ్వమని చెప్పాలి.
10. చదవడం, వీడియో చూడటం, వినడం, ఆక్టివిటీ చేయడం, అస్సెస్మెంట్ మరియు క్విజ్ అనే 5 అంశాలను 5 రోజులు చేసేటట్లు సూచనలు ఇస్తుండాలి.
11. సమాచారం state technical team నుండి district technical team కు, అక్కడ నుండి SRG లకు, SRG ల నుండి మాత్రమే వారికి అటాచ్ చేయబడిన teacher గ్రూప్స్ కి చేరాలి. ఈ లింక్ miss అవ్వకూడదు.
12. D I E T ఫాకల్టీ కి, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు కు SRGs ని tag చేసి రోజు వారీ కార్యక్రమం పై feedback తీసుకుంటూ తగిన సలహాలు, సూచనలు అందచేయాలి. 13. ఇప్పటివరకు enroll అయిన అవ్వనట్లు కనిపిస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు లాగిన్ సమస్యలు మరియు కొంతమంది ఉపాధ్యాయులు కోర్స్ పూర్తి అవ్వకుండానే generate అవుతున్న అంశాలను రాష్ర్ట కార్యాలయం వారు దృష్టిలోకి తీసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడానికి అంగీకరించారు.
14. Login అవ్వని ఉపాధ్యాయులు వివరాలను CRP లు మరియు మండల MIS కోఆర్డినేటర్ ల ద్వారా సమస్య పరిష్కారానికి తోడ్పడాలి.
15. లాగిన్ అయ్యి, కోర్స్ లో involve కానీ ఉపాధ్యాయులు విషయంలో తగు చర్యలు తీసుకోవలసిందిగా MEO లకు జిల్లా స్థాయి నుండి సూచనలు జారీ చేయాలి.
16. మండల వాట్సాప్ గ్రూప్ లలో SRG లకు సంబంధించిన ఉపాధ్యాయులు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదు, ఎందుకు వినడం లేదు అన్న వివరాలను సేకరించి, అర్థం కాని టీచర్స్ కి పక్కనే ఉన్న ఇంకొక టీచర్ తో ఎలా చేయాలి అని map చేయాలి.
17. రాష్ట్ర కార్యాలయం నుండి పంపబడ్డ లింక్ ద్వారా హాజరు మరియు feedback రోజూ నమోదు అయ్యేటట్లు అలెర్ట్ గా ఉండాలి.
పై అంశాలను SRG లు కూడా అవగాహన చేసుకొని జిల్లాలో జరుగుతున్న శిక్షణలో 100 శాతం హాజరు నమోదు అయ్యేటట్లు, శిక్షణ పూర్తి చేసేటట్లు సహకరిస్తారని తెలియచేస్తున్నాము.
0 Post a Comment:
Post a Comment