కేంద్రం నుంచి PPF (PUBLIC PROVIDENT FUND) స్కీమ్...రూ. 5000 తో 17 లక్షలు
◾ మీకోసం కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్ అందుబాటులో ఉంది.
◾ ఈ పథకంలో చేరడం వల్ల మెచ్యూరిటీ సమయంలో కళ్లుచెదిరే లాభం పొందొచ్చు.
◾ ఆ స్కీమ్ పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
◾ వీలైనంత త్వరగా ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం మంచిది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటి. ఇది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనం.
◾ ఇందులో డబ్బులు పెట్టడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం పొందొచ్చు.
◾ ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు.
◾ ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ స్కీమ్‌లో కనీసం రూ.500 డిపాజిట్ చేస్తే సరిపోతుంది.
◾ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
◾ అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉంది.
◾ ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టిన వారు ఆదాయపు పన్ను శాఖ అందించే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
◾ సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
◾ మీరు పీపీఎఫ్ అకౌంట్‌లో నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే ఎంత రాబడి పొందొచ్చొ తెలుసుకుందాం.
◾ పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు.
◾ దీన్ని కావాలనుకుంటే ఐదేళ్ల చొప్పున పెంచుకుంటూ వెళ్లొచ్చు. ఇలా మీరు నెలకు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి ఏకంగా రూ.17 లక్షలు వస్తాయి.
◾ ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.
0 Post a Comment:
Post a Comment