Thursday, 10 September 2020

హెచ్ఆర్ఏ, హోమ్ లోన్ రెండూ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు

 హెచ్ఆర్ఏ, హోమ్ లోన్ రెండూ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు




సొంతింట్లో కాకుండా అద్దె ఇంట్లో ఉండ‌టానికి స‌రైన కార‌ణం చూపితే రెండింటిని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు


◾ సొంత ఇల్లు ఉన్న‌ప్ప‌టికీ, ఇత‌ర కార‌ణాల చేత‌ అద్దె ఇంట్లో నివ‌సిస్తున్నట్ల‌యితే ఆదాయపు పన్ను త‌గ్గించుకునేందుకుగాను హెచ్ఆర్ఏ, గృహ రుణం… రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు. జులైలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం మొత్తం గృహ రుణ మిన‌హాయింపు ప‌రిమితిని ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల నుంచి రూ.3.5 ల‌క్ష‌ల‌కు పెంచింది. రూ.45 ల‌క్ష‌ల లోపు విలువైన గృహాల‌కు ఇది వ‌ర్తిస్తుంది. ఈ అదనపు మినహాయింపు మార్చి 31, 2020 వరకు తీసుకున్న కొత్త గృహ రుణాలపై లభిస్తుంది.

◾ హెచ్ఆర్ఏ, గృహ రుణం రెండింటినీ క్లెయిమ్ చేసే అవ‌కాశం ఉంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఇది వారు చెప్పే కార‌ణంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆదాయపు పన్ను అధికారులు మీరు అందించిన వివరాలను పరిశీలిస్తే, మీరు ఇల్లు కలిగి ఉన్న చోట నివసించకపోవడానికి త‌గిన‌ కారణం ఉండాలి.

◻️ రెండూ ల‌భించే కొన్ని సంద‌ర్భాలు చూస్తే…

◾ సొంతింటిపై రుణం చెల్లిస్తూ ఉద్యోగం, ఇత‌ర కార‌ణాల రిత్యా వేరే నగరంలో ప‌నిచేస్తూ అక్కడ అద్దె చెల్లిస్తుంటే, రెండింటినీ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

◻️ ఒక చిన్న ఇల్లు క‌లిగి ఉండి కూడా పెద్ద ఇంట్లో వారి సౌక‌ర్యం కోసం అద్దెకు ఉంటే...

◾ ఒక చోట ఇల్లు కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ, పిల్ల‌ల స్కూళ్లు,ఇత‌ర కార‌ణాల చేత వెంట‌నే కొత్త ఇంటికి మార‌క‌పోవ‌డం వంటి సంద‌ర్భాల్లో రెండింటిపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌వచ్చు. అంటే సొంత ఇల్లు ఉన్న‌ప్ప‌టికీ, అద్దె ఇంట్లో నివ‌సించ‌డానికి అర్థ‌వంత‌మైన కార‌ణం ఉంటే క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

◾ ఇంటిపై గృహ రుణం చెల్లిస్తూ, వేరే చోట అద్దె చెల్లిస్తున్నప్పుడు సొంతింటి ద్వారా వ‌చ్చిన అద్దె ఆదాయాన్ని లెక్కచూపాలి. ఈ సందర్భంలో కూడా, మీరు హెచ్ఆర్ఏ మినహాయింపు, గృహ రుణ మినహాయింపు రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు.

◾ అలాగే, ఈ సంవత్సరం నుంచి, రెండు ఆస్తులను ఒకరి స్వంత నివాస ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే వాటిని ఆదాయపు పన్ను సొంత ఆస్తిగా ప‌రిగ‌ణించేందుకు అనుమతించింది. ఇంతకుముందు, ఒక ఆస్తిని మాత్రమే స్వీయ-ఆక్రమిత ఆస్తిగా ప‌రిగ‌ణించేవి, మిగిలిన వాటిపై వ‌చ్చే అద్దెపై ప‌న్ను వసూలు చేసేది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top