Sunday 13 September 2020

పాఠశాల, కళాశాలల విద్యార్థులకు దిక్సూచీ - ఉపాధి, ఉద్యోగ, వివిధ కోర్సుల వివరాలు లభ్యం

 పాఠశాల, కళాశాలల విద్యార్థులకు దిక్సూచీ - ఉపాధి, ఉద్యోగ, వివిధ కోర్సుల వివరాలు లభ్యం





672 రకాల కోర్సులు, 550 క్లస్టర్ల వివరాలతో కూడిన కెరీర్‌ పోర్టల్‌


పాఠశాల విద్యాశాఖ ఏపీఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యం


సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలు చేపట్టారు. 'ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌' ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో దీనిని అమలుచేస్తున్నారు.ఏపీలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్‌లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు చూపిస్తున్నారు.


శిక్షణ తరగతుల నిర్వహణ : 

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేపు చినవీరభద్రుడు, పాఠశాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ జి.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్, ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా వెబ్‌నార్‌లో రాష్ట్రంలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సెకెండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, 9, 10, ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందజేస్తున్నారు. కేరీర్‌ గైడెన్స్‌ ఇస్తున్నారు.


కెరీర్‌ పోర్టల్‌లో నమోదు ఎలా...?

'ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌'లో విద్యార్థి తమ చైల్డ్‌.ఇన్‌ఫో ద్వారా రిజిస్టర్‌ కావాలి. పాస్‌వర్డ్‌గా 123456 ఉంటుంది. నమోదు తొమ్మిది భాషల్లో చేసుకోవచ్చు. విద్యార్థి తమకు నచ్చిన భాషలో ఎంపిక చేసుకుని లాగిన్‌ అయ్యి.. డాష్‌కోడ్‌లో మై కెరీర్‌లో డెమోలో ప్రొఫైల్‌ నింపాలి. విద్యార్థి చదువు, కుటుంబ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో సహా ఎంటర్‌ చేస్తే ఈ పోర్టల్‌లో నమోదు అయినట్లే.

కోర్సుల సమాచారం ఇలా...?

550 క్లస్టరర్లతో కూడిన 672 రకాల కోర్సులు, ఉపాధి, ఉద్యోగావకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. వ్యవసాయం/అందం/ఆరోగ్యం/వృత్తి నైపుణ్యం/64 కళలకు సంబంధించిన కోర్సులు/ బయలాజికల్, మెరైన్, రబ్బర్, ఆరి్టఫీషియల్, ఎనర్జీ, సో లార్‌ తదితర ఇంజినీరింగ్‌ కోర్సుల వివరాలు ఉంటాయి. ఒక్కో కోర్సుకు అయ్యే ఖర్చు, కోర్సు తర్వాత వాటి భవిష్యత్తు, జీతభత్యాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీలు, ఉపకార వేతనాలు పొందే వీలుంది. (ఉదాహరణకు సంతూర్, గ్లో అండ్‌ లవ్లీ, రమణ్‌కుమార్‌ ముంజల్, ఆర్‌కేఎం ఫౌండేషన్‌) వారి ఉపకార వేతనాలు ఆంధ్రప్రదేశ్‌ కెరీర్‌ పోర్టల్‌.ఇన్ లో ఉంటాయి.


కోర్సులు, పరీక్షల వివరాలు :

వివిధ రకాల నోటిఫికేషన్లు, ఫీజులు, పరీక్షలు, కోర్సుల వివరాలు, చివరి తేదీ, వాటికయ్యే ఖర్చు, జీతం, ఉపకార వేతనాలు తదితర వివరాలు ఆంధ్రప్రదేశ్‌ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌లో ఉంటాయి.


విద్యార్థులకు సువర్ణవకాశం :

9, 10 తరగతులు, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్, లైఫ్‌స్కిల్స్‌పై రూపొందించిన చక్కని కార్యక్రమం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపయోగకరమయ్యే కోర్సుల వివరాలతో కార్యక్రమాన్ని చక్కగా రూపొందించారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారమే.



CLICK HERE TO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top