Wednesday 16 September 2020

ఇష్టమైతేనే బడికి...లేకుంటే ఇంట్లోనే...! కరోనా దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి.


ఇష్టమైతేనే బడికి...లేకుంటే ఇంట్లోనే...!

   

✔️ 21 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

✔️ 9 నుంచి 12 తరగతులకు బోధన

✔️ కరోనా దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి

✔️ మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం






🔘 అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది.

🔘 మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది.లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆప్షన్‌ ఇచ్చింది. 

🔘 ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని పేర్కొన్నది.

  ◾ కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు : 

▪ కంటైన్మెంట్‌ జోన్లకు బయట ఉన్న స్కూళ్లనే తెరువాలి. కంటైన్మెంట్‌ జోన్లలోని విద్యార్థులు,టీచర్లు, ఉద్యోగులు బడికి రావద్దు.

▪ తరగతి గదితోపాటు అందరూ వినియోగించే అన్ని ప్రాంతాలను విధిగా శానిటైజ్‌ చేయించాలి.

▪ ఒకవేళ స్కూల్‌ను క్వారంటైన్‌ సెంటర్‌గా వాడితే పరిసరాలన్నింటినీ వందశాతం శానిటైజ్‌ చేయాలి. 

▪ పాఠశాలకు రావడం, వర్చువల్‌ క్లాసులకు వెళ్లడం..వంటివి ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలేయాలి. 

▪ చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బులు, శానిటైజర్లను విద్యార్థులు, సిబ్బందికి అందుబాటులో ఉంచాలి.

▪ స్టాఫ్‌గది, కార్యాలయం,మెస్‌, గ్రంథాలయం, కేఫటేరియాల్లో భౌతికదూరం పాటించేలా చూడాలి.

▪ విద్యార్థి,టీచర్‌ మధ్య ఇంటరాక్షన్‌ కోసం ఆరుబయట,లేదంటే చెట్లకింద ఏర్పాట్లు చేయాలి.  

▪ తరగతి గది ఉష్ణోగ్రతలు 24 -30 సెల్సియస్‌ డిగ్రీలుగా, తేమ 40 -70 శాతంగా ఉండాలి.

▪ గదుల్లో గాలి ధారాలంగా రావాలి. స్వచ్ఛగాలిని పీల్చుకునేందుకు వీలుగా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.

▪ విద్యార్థులు ఉపయోగించే, లాకర్లు,అల్మారాలను రోజుకొకసారి శానిటైజేషన్‌ చేయాలి. ఈతకొలనులను తెరువద్దు.

◾ యాక్టివిటీస్‌ సమయంలో...

▪ నోటుపుస్తకాలు, పెన్నులు,పెన్సిళ్లు, వాటర్‌బాటిళ్లను ఒకరినొకరు మార్చుకోవడాన్ని అనుమతించరాదు.

▪ ప్రయోగశాలల్లోకి తక్కువ మందిని అనుమతించాలి. సెషన్లుగా విభజించి విద్యార్థులను తీసుకెళ్లాలి. 

▪ ప్రయోగశాలల్లోని పరికరాలను వాడకముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు శానిటైజ్‌చేయాలి. 

▪ టైమ్‌స్లాట్స్‌గా, విద్యార్థులను బృందాలుగా విభజించి కృత్యాలు నిర్వహించాలి. అనంతరం శానిటైజ్‌ చేయాలి.

◾ ఇతర జాగ్రత్తలు :

▪ బస్సుల్లో విద్యార్థులను తరలించేటప్పుడు భౌతికదూరం పాటించాలి.

▪ తరగతులు, ప్రయోగశాలల్లో విద్యార్థులు తాకే ప్రాంతాలన్నింటిని ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలి. 

▪ పాఠశాల ప్రారంభానికి ముందు,ముగిసిన తర్వాత రెండుసార్లు శానిటైజ్‌చేయాలి.

▪ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను 70 శాతం ఆల్కహాల్‌ గల వైపర్ల క్రిమికీటకనాశనం చేయాలి.

▪ తాగునీరు, హ్యాండ్‌వాష్‌స్టేషన్లు, మూత్రశాలలు,v మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

▪ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడిన మాస్క్‌లు ప్రత్యేక డబ్బాల్లో వేయాలి. మూడురోజుల కోసారి పడేయాలి.

▪ విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్‌ యాక్టివిటీస్‌ కోసం వాడరాదు.

▪ పాఠశాల ప్రాంగణంలో, ఆరుబయట, రోడ్లమీద గుమిగూడొద్దు.

▪ విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైన వారిని పాఠశాలకు రావొద్దని ఆదేశించాలి. 

▪ టీచర్లు,స్కూల్‌ కౌన్సిలర్లు,స్కూల్‌ హెల్త్‌వర్కర్లు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపే ప్రయత్నం చేయాలి.

▪ విద్యార్థులు,టీచర్లల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఇతరుల నుంచి వేరుచేయాలి. (ఐసోలేషన్‌)

▪ అనార్యోగానికి గురైనవారికి ఒకవేళ పాజిటివ్‌వస్తే వెంటనే వారు తిరిగిన ప్రదేశాలను శానిటైజేషన్‌ చేయాలి.

◾ పాఠశాలలు తెరిచిన తర్వాత...

▪ విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కనీసం 6 ఫీట్ల భౌతికదూరం ఉండాలి. అందరికీ ఫేస్‌షీట్స్‌, మాస్క్‌లు తప్పనిసరి.

▪ ఆల్కహాల్‌ బేస్డ్‌ శానిటైజర్‌తో తరచూ చేతులు కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా మోచేతిని, చేతిరుమాలును అడ్డుపెట్టుకోవాలి. 

▪ పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడం నిషేధం. అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడాలి.

▪ ఉదయం, సాయంకాల ప్రార్థనలు, ఆటలు, ఈవెంట్స్‌ను తక్కువ మంది విద్యార్థులతోనే నిర్వహించాలి. 

▪ అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి రాష్ట్ర, స్థానిక ఆరోగ్యసిబ్బంది హెల్ప్‌లైన్‌ నెంబర్లను ప్రదర్శించాలి. 

▪ హైరిస్క్‌ ఉన్నవారు.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాపై ఉద్యోగులు, విద్యార్థుల్లో అవగాహన పెంచాలి

◾ అందుబాటులో ఉంచాల్సినవి :

▪ పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్లు, ఫేస్‌కవర్లు, మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లను పెద్దఎత్తున నిల్వ ఉంచుకోవాలి.

▪థర్మల్‌గన్స్‌, ఆల్కహాల్‌వైపర్లు, సబ్బులు, పల్స్‌ ఆక్సీమీటర్లు, ఐఈసీలను సైతం అంబాటులో ఉంచుకోవాలి.

▪ వాడిన పీపీఈ కిట్లు, చెత్తను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం తరలించాలి.

▪ వ్యర్థాల సేకరణ, నిర్వహణపై పారిశుధ్య కార్మికులకు (హౌస్‌కీపింగ్‌) శిక్షణనివ్వశిక్షణనివ్వలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top