బడులు తెరుస్తున్నారు...? ఉపాధ్యాయులకు కరోనా ముప్పు.... ! తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఇందులో చాలా వరకు అనుకోకుండా వైరస్ బారిన పడ్డవారు ఉంటే, కొన్ని చోట్ల మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల వైరస్ బారిన పడ్డారు
ఈ సందర్భంగా టీచర్లు ఖచ్చితంగా కొన్ని స్వయం నిబంధనలు పాటించాలి.
ఇంటి నుండి బడికి వెళ్లే ముందు :
1. మాస్కు ధరించాలి, ఫేస్ షీల్డ్ కూడా.
2. బ్యాగ్ లో సబ్బు, సానిటైజర్, మాస్కు ఉంచుకోవాలి.
3. ఎవరి ప్లేట్, వాటర్ బాటిల్, స్పూన్ వారే తీసుకువెళ్లాలి.
4. పవర్ బ్యాంక్, చార్జర్ లు వంటివి కూడా ఎవరివి వారే తీసుకువెళ్లాలి.
5. టూ వీలర్ పై ఒక్కరు మాత్రమే వెళ్ళాలి.
6. కార్లో ఇద్దరు మాత్రమే ఒకరు ముందు సీట్లో ఇంకొకరు వెనుక సీట్లో కూర్చోవాలి. కార్ కిటికీలు తెరిచి ఉంచాలి.
7. బస్ లో వెళ్లే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం మొత్తం మాస్కు ధరించాలి, బస్ దిగగానే సానిటీజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
8. అనవసరముగా ఎవరితో ముచ్చటించరాదు (ప్రయాణంలో...)
9. అనారోగ్యముగా ఉంటే బడికి వెళ్లకూడదు. అనారోగ్యంతో బడికి వచ్చి ఇతరులకు వైరస్ అంటించిన సంఘటనలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.
10. అవసరమైన మందులు వెంట తీసుకివెళ్లాలి.
11. ఏ ఒక్క లక్షణం ఉన్న టెస్టింగ్ కు వెళ్ళండి.
12. టెస్టింగ్ కు వెళ్లి ఉంటే రిజల్ట్స్ వచ్చేవరకు ఇంటి వద్దే ఉండండి.
పాఠశాలలో...
1. అనవసరంగా వస్తువులను తాకారాదు.
2. భౌతిక దూరం పాటించాలి.
3. మాస్కు, ఫేస్ షీల్డ్ నిరంతరం ధరించాలి.
4. మీరు వాడే వస్తువులను రోజు శుద్ధి చేసుకోవాలి.
5. కరచాలనం వద్దు,నమస్కారం ముద్దు.
6. సమావేశాలు భౌతిక దూరం తో నిర్వహించాలి.
7. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.
8. భోజనాలు సామూహికంగా చేయరాదు..ఎవరి స్థానంలో వారే తినడం మంచిది.
9. బడికి వచ్చే బయటి వారితో తగు జాగ్రత్తలు పాటించాలి.
10. అత్యంత సన్నిహితులతో కూడా జాగ్రత్తలు పాటించాలి.
11. విద్యార్థులను కలవడానికి వెళ్ళినపుడు కోవిడ్ నిబంధనలు పాటించాలి.
12. బడిలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించండి.
ఇంటికి వచ్చిన తరువాత...
1. ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయండి.
2. విడిచిన బట్టలు డిటర్జెంట్ లో నాన పెట్టండి.
3. తీసుకు వెళ్లిన వస్తువులను శుద్ధి చేయండి.
4. మోబైల్ ని శుభ్రం చేయండి.
5. ఇవన్నీ పూర్తయ్యేదాకా ఇంట్లో వారికి దూరంగా ఉండండి.
6. ఆవిరి పట్టుకోండి.
7. గొంతుని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి.
వీటితో పాటు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర ఖచ్చితంగా అలవర్చుకోండి. అనవసర ఆందోళనలు వద్దు
0 Post a Comment:
Post a Comment