Wednesday 5 August 2020

ESR - ఈ-సర్వీస్ రిజిస్టర్ తో పారదర్శకతకు పెద్దపీట : : ఒక్కసారి నమోదు చేసుకుంటే ఉద్యోగ విరమణ వరకు లేదిక చింత



ESR - ఈ-సర్వీస్ రిజిస్టర్ తో పారదర్శకతకు పెద్దపీట : : ఒక్కసారి నమోదు చేసుకుంటే ఉద్యోగ విరమణ వరకు లేదిక చింత











<<<విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా అమలు>>>

<<< సమస్త వివరాల నమోదుకు మార్గదర్శకాలు>>>


◾ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్త సమాచారం ఆన్లైన్లో నిక్షిప్తం కానుంది. ఇప్పటి వరకు మాన్యువల్ పద్ధతిలో నిర్వహిస్తూ వచ్చిన సర్వీసు రిజిస్టర్ ఇక డిజిటల్ రూపు దాల్చనుంది.

◾ ఫలితంగా ఉపాధ్యాయులకు వారి సర్వీసు ఆధారంగా చేసుకుని ఇంక్రిమెంట్లు, ఉద్యోగోన్నతులు, ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయాలను పొందడం సులభతరం కానుంది. 

◾ తమకు రావాల్సిన ఇంక్రిమెంట్ల కోసం ఉపాధ్యాయులు డ్రాయింగ్ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకపోవడంతో పాటు నెలవారీ వేతనాల బిల్లుల తయారీ కోసం డ్రాయింగ్ అధికారులు పడుతున్న శ్రమ నుంచి ఉపశమనం లభించనుంది.

◾ ఇప్పటి వరకు మండల స్థాయిలో ఎంఈవోల ద్వారా అప్ డేట్ చేస్తున్న సర్వీసు రిజిస్టర్లను ఇకపై కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్లనుంది.

◾ ఉపాధ్యాయుల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే విధంగా పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ (ఈ-ఎస్సార్)ను ప్రవేశపెడుతోంది.

◾ ఇందులో భాగంగా విద్యాశాఖను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ (ఈ-ఎస్సార్)ను ప్రయోగాత్మకంగా అమలు పర్చేందుకు నిర్ణయించింది.

◾ విద్యాశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లను ఈఎస్సార్లుగా మార్పు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఈ-సర్వీస్ రిజిస్టర్తో ప్రయోజనాలు :


◾ ఈ-సర్వీస్ రిజిస్టర్తో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల పర్యవేక్షణలో సర్వీస్ రిజిస్టర్లు ఉండేవి.

◾ అయితే నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-సర్వీస్ రిజిస్టర్ విజయవాడ లోని సీఎన్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ నియంత్రణలోకి వెళ్లనుంది.

◾ ఫలితంగా ఉద్యోగులకు రావాల్సిన జీత భత్యాలు, ఇంక్రిమెంట్లను అర్ధం లేని సాకులతో నిలిపివేసే అవకాశం ఇకపై డీడీవోలకు ఉండదు.

◾ దీంతో పాటు ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేసే నాటికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్ధిక పరమైన ప్రయోజనాలు, పెన్షన్‌కు ప్రతిపాదనలు హార్డ్ కాపీలతో సంబంధం లేకుండా నేరుగా అకౌంట్స్ జనరల్ కార్యాలయానికి పంపుకునే వీలుంటుంది.

◾ ఈ-ఎస్సార్తో జిల్లాస్థాయిలో ఖజనా శాఖాధికారుల ప్రమేయం సైతం చాలా వరకు తగ్గిపోతుంది. ఉద్యోగ విరమణకు ఏడాది ముందుగానే ప్రపోజల్స్ ను పంపుకునే వీలుంటుంది.

సమర్పించాల్సిన పత్రాలు : 


◾ ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేదీ లోగా తమ వివరా
లను ఈ-ఎస్సాలో విధిగా నమోదు చేసుకోవాలి. ఇందుకు పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఒరిజినల్ మార్కుల జాబితాలు, డిగ్రీ, బీఈడీ, టీటీసీ ఓడి ప్రోవిజనల్స్ తోపాటు విద్యార్హతుల ఉంటే వాటికి సంబంధించి పత్రాలు, అపాయింట్ మెంట్ ఆర్డర్, రెండు పాస్ సైజు ఫోటోలు (ఇందులో ఒకటి ఉద్యోగం పొందినప్పటిది ఉంటే సరి, లేకుంటే రెండూ లేటెస్ట్వ), మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఉద్యోగ కాలంలో ఎక్కడెక్కడ పనిచేసిందీ ప్రొసీడింగ్స్ తో సహా ఒరిజినల్ కాపీలు, ఏఏఎస్ ప్రాసీడింగ్స్, ఉద్యోగోన్నతి ప్రొసీడింగ్స్, పీఎఫ్, పాన్‌కార్డు, సీపీఎస్ ఉద్యోగి అయితే ప్రాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ, కుటుంట సభ్యులందరి ఆధార్ నంబర్లు, శారీరక వైకల్యం గల వారు నిర్ధారణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారు క్యాస్ట్ సర్టిఫికెట్, జీఐఎస్లో నమోదైన ఎస్సార్ పేజీలన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.


లాగిన్ ఇలా...


◾ ఏపీఈఎస్ఆర్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి.

◾ ప్రభుత్వం ఇచ్చిన ఐడీ నంబరును ఎంటర్ చేస్తే ఉద్యోగి వివరాలతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు స్క్రీన్ పై కని పిస్తుంది.

◾ నిర్ధారించుకున్న తర్వాత ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగా ఈ-ఎస్సారకు సంబంధించిన ప్రాఫార్మా ఓపెన్ అవుతుంది.

◾ అందులో 11 విభాగాల వారీగా ఒక్కో విభాగాన్ని ఉపాధ్యాయుడు పూర్తి చేయాలి. డాక్యుమెంట్లను సైతం అప్లోడ్ చేయాలి.

◾ ఇదే సైట్లో రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో నంబర్ ఎంఎస్ 99 కాపీతో పాటు ఈ-ఎస్సార్ పూరించడం లో పాటించాల్సిన నిబంధనలు, కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలతో మోడల్ ప్రొఫార్మాను పొందవచ్చు.

◾ వ్యక్తిగత, ఉద్యోగానికి సంబంధించిన సమస్త వివరాలు, సమాచారాన్ని పూర్తి పారదర్శకంగా సైట్లో నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.

◾ సైట్లో అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత దానిని సెండ్ చేస్తే అది ఆన్లైన్లో సంబంధింత డ్రాయింగ్ అధికారికి చేరుతుంది.

◾ ఉపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం డ్రాయింగ్ అధికారి నుంచి నేరుగా సీఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రభుత్వానికి వెళ్తుంది. తద్వారా సంబంధిత ఉపాధ్యాయుడి పేరుతో ఈ-సర్వీస్ రిజిస్టర్ కొత్తగా క్రియేట్ అవుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top