Saturday 15 August 2020

E-SR గురించి ఆఫీస్ నుండి SR తీసుకొనేటప్పుడు గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు

 

E-SR గురించి ఆఫీస్ నుండి SR తీసుకొనేటప్పుడు గమనించవలసిన కొన్ని ముఖ్య అంశాలు





🔘 SR తీసుకునే ముందు ముఖ్యముగా ఒక వైట్ పేపర్ తీసుకుని  ఇప్పటి వరకు మీ సర్వీస్ నందు ఏయే ENTRIES ఉండవలెనో ఆ పేపర్ మీద రాసుకుని SR తీసుకున్న తరువాత మీ SR నందు మీరు పేపర్ మీద రాసుకున్న అన్ని ENTRIES ఉన్నవో లేదో CHECK చేసుకుని లేని యెడల ఆఫీస్ సిబ్బందితో ఆ ENTRIES రాయించుకుని DDO గారి SIGN చేయించుకోగలరు.

🔘 అంతే కాక మీ సర్వీస్ నందలి అందరి DDO ల SIGNATURES ఆ ENTRIES వద్ద ఉన్నవో లేవో సరి చూసుకుని లేని యెడల వారితో కూడా SIGN చేయించుకోగలరు. ✍️ SR నందు మీరు చూసుకోవలసిన ENTRIES :


◾ మొదటి మరియు రెండవ పేజీ లో మీ యొక్క వ్యక్తిగత వివరాలు అయినటువంటి మీ పేరు మీ ఇంటి పేరుతో సహా, మీ చిరునామా,మీ పుట్టిన తేది, మీ పుట్టు మచ్చలు.

◾ మీ EDUCATIONAL QUALIFICATIONS పూర్తిగా. చాలా మంది జాబ్ వచ్చిన తరువాత కూడా HIGHER STUDIES చదువుతారు. వాటిని కూడా నమోదు చేయించుకోవాలి.

◾ పోలీస్ ENQUIRY అయిన వారు DEO నుండి కనుక SERIVICE REGULARISATION చేయించుకున్న యెడల దాని యొక్క నమోదు.

◾ మీరు ఈ JOB ను లోకల్ స్టేటస్ యందు కానీ NON లోకల్ స్టేటస్ నందు కానీ పొంది ఉన్నారా అనే దాని యొక్క నమోదు.

◾ ఇప్పటి వరకు మీరు తీసుకున్న INCREMENTS దాని తాలూక PAY స్కేల్ ల నమోదు.

◾ మీరు జాయిన్ అయిన దగ్గర నుండి వన్ ఇయర్ పూర్తి అయిన తరువాత వేసే సర్వీస్ వెరిఫికేషన్ అన్నిటి యొక్క నమోదు.

◾ మీకు కట్ అయ్యే GIS మరియు APGLI నమోదు. ఒకవేళ మధ్యలో APGLI పెంచిన వాటి యొక్క నమోదులు.

◾ PRAN నెంబర్ నమోదు.

◾ 6/12/18/24 స్కేల్స్ యొక్క నమోదులు ◾ అన్ని PRC ల నమోదులు.

◾ మీరు వినియోగించుకున్న HALF PAY వివరాలు. ఒకవేళ వినియోగించుకోని యెడల SR చివర HALF PAY LEDGER BALANCE వివరాల నమోదు.

◾ SR చివరన మీకు సర్వీస్ నందు వచ్చు ELs, మరియు సమ్మర్ నందు ట్రైనింగ్స్ కానీ ఏమైనా DUTIES కానీ చేసిన వచ్చు ELs వివరాలు.

◾ ఒకవేళ మీరు ELs ను లీవ్ గా వాడు కున్న లేక ENCASH చేసుకున్న వాటి యొక్క నమోదులు.

◾ LADY టీచర్స్ ఉపయోగించుకునే MATETNITY LEAVE , ABORTION LEAVE , CHILD CARE LEAVE నమోదులు.

◾ మేల్ ఎంప్లాయిస్ ఉపయోగించుకునే PATERNITY LEAVE నమోదు.

◾ ఎవరైనా STUDY LEAVE వినియోగించుకుంటే వాటి నమోదు.

◾ సర్వీస్ నందు ఉపయోగించుకునే ఏ ఇతర ప్రయోజనాల యొక్క నమోదులు.

◾ ఎవరైనా ఏ ఇతర జీత ప్రయోజనాలు పొందిన వాటి వివరాలు. ( STEPUP, NOTIONAL INCREMEMTS, హామీపత్రాల వివరాలు) నమోదు.

✍️ ఇలా మన సర్వీస్ నందు మనం పొందే ప్రతి దాని వివరాలను నమోదు చేసారో లేదో చూసుకుని SR ను తీసుకున్న ESR చేసుకునుటకు ప్రయోజనం ఉంటుంది.

✍️ అందుకనే మీరు మీ వివరాలను ఒక పేపర్ పై రాసుకుని SR తీసుకున్న తరువాత చెక్ చేసుకుని SR ను పొందగలరు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top