Wednesday 26 August 2020

DOWNLOAD ADMIT CARDS - NATIONAL ELEGIBILITY cum ENTRANCE TEST (NEET)

DOWNLOAD ADMIT CARDS - NATIONAL ELEGIBILITY cum ENTRANCE TEST (NEET) 





నీట్‌ 2020 అడ్మిట్‌ కార్డ్‌ విడుదల


🔘 సెప్టెంబర్‌ 13న నిర్వహించనున్న నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌ 2020)కి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ 2020 కి సంబంధించిన అడ్మిట్‌కార్డులను కూడా ఎన్‌టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష‌ సెప్టెంబరు 13న నిర్వహించనుంది

ఎన్‌టీఏ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

◾ విద్యార్థుల్లో అధిక శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్‌నే కేటాయించాలి.

◾ పరీక్ష సెంటర్‌కి వచ్చే విద్యార్థులు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లు ధరించాల్సి ఉంటుంది.

◾ వాటర్ బాటిల్‌, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి.

◾ భౌతిక దూరం పాటించాలి.

◾ ఎగ్జామ్‌ సెంటర్‌లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే తీసుకురావాలి.

◾ కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. గుంపులుగా ఉండకూడదు.

◾ శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్‌హీట్‌ డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్‌ గదుల్లో పరీక్ష.

◾ ఐసోలేషన్‌ గదుల్లోనే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే.. ప్రత్యేక రూమ్‌లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు.

◾ పరీక్ష హాల్‌లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి.

◾ పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి.

◾ పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్‌, గ్లోవ్స్‌ని పరీక్ష సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేయాలి.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top