Thursday, 27 August 2020

ఏపీలో ‘మాస్కే కవచం’ పేరిట విస్తృత ప్రచారానికి శ్రీకారం..!


ఏపీలో ‘మాస్కే కవచం’ పేరిట విస్తృత ప్రచారానికి శ్రీకారం.


    కరోనాను కట్టడి చేయడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని “మాస్కే కవచం” పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. విజయవాడలోని ఆర్ &బి బిల్డింగ్ కోవిడ్ కమాండ్ సెంటర్ లో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

    ఉపయోగించిన మాస్కుల్ని మూడు రోజుల పాటు మూసిన కవర్లో ఉంచి పారేయాలని సూచించారు. ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదని తెలిపారు. మీ ఇళ్లల్లో 60 ఏళ్లు పైబడిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా రోడ్లపైకి వెళ్ళినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top