KVS Admission 2020-21 New Guidelines - కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో మారిన అడ్మిషన్ రూల్స్ ఇవే
◾ 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ రూల్స్‌ని మార్చింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. ఈ వివరాలను https://kvsangathan.nic.in/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.
◾ కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు కేటాయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లోనే నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది.
◾ 1వ తరగతిలో అడ్మిషన్లు ఆన్‌లైన్ డ్రా ద్వారా చేపడతారు. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతా క్రమంలో అడ్మిషన్లు ఉంటాయి.
◾ ఒకవేళ ఉన్న సీట్ల కన్నా దరఖాస్తులు ఎక్కువైతే లాటరీ సిస్టమ్ అమలు చేస్తారు.
◾9వ తరగతి అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. 11వ తరగతి అడ్మిషన్లు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇక 10వ తరగతి, 12వ తరగతి అడ్మిషన్లు సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది.
0 Post a Comment:
Post a Comment