ACADEMIC ALERT - ప్రాధమిక , ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కొన్ని ముఖ్యమైన సూచనలు
మార్చి19 తేదీ నుండి కరోనా కారణంగా ఉన్నపళంగా మన పాఠశాలలు మూసివేయుట జరిగింది.. రికార్డులు అసంపూర్తిగా వదిలేసి ఇళ్లకు వెళ్లుట జరిగినది. విధ్యార్ధి జీవితానికి చదువు ఎంత ముఖ్యమో. వాని వివరాలకు సంబంధించిన రికార్డులు కూడా అంతే ముఖ్యం.. కావున ప్రధానోపాధ్యాయులు ఇప్పటికే అన్ని రికార్డులు update చేసివుంటే చాలా సంతోషం..update చేసి ఉండకపోతే ఇప్పుడైనా క్రింది సూచనలు పాటించి రికార్డులు update చేయండి.
1. Admission Register :
2019-20 విద్యా సంవత్సరంకు సంభందించి క్రొత్తగా చేరినవారి పేర్లు అడ్మిషన్ రిజిస్టర్ లో వ్రాసి వుంటారు..గత విద్యాసంవత్సరం అడ్మిషన్లు మార్చి 19 వ తేదీతోనే పూర్తి అయినవి కావున ఆ పేజీలో చివరి ఎంట్రీ తర్వాత HM సంతకం చేసి , స్టాంప్ వేయండి. అలానే అడ్మిషన్ ఫార్మ్స్ సరిగా పూర్తి చేశారో లేదో ఒకసారి పరిశీలించుకొని.. ఇంకా ఏమైనా పూరించాల్సింది ఉంటే పూరించి, దానిలో కూడా నిర్దేశిత ప్రదేశంలో HM సంతకం చేసి వానిని కూడా కట్టకట్టి file raper వేసి పైన అడ్మిషన్ ఫార్మ్స్ 2019-20 అని వ్రాసి భద్రపరచండి..ఏదైనా సమస్య వచ్చినప్పుడు refer చేసుకోవడానికి అవసరం.
2. Promotion Register/Consolidated Attendance Register :
దీనిని కూడా మార్చి 19వ తేదీ వరకు నెల వారీగా మొత్తం హాజరైన రోజులు , హాజరు శాతం లెక్కించి మధ్యలో మానివేసినవారు తప్ప అందరినీ ప్రమోట్ చేయాలి..వీరికి చివర result అనే column లో promoted అని వ్రాయాలి, మధ్యలో మానివేసిన వారికి discontinued అని వ్రాయాలి. ఈ రికార్డ్ చివర్లో కూడా HM సంతకం చేసి , స్టాంప్ వేయాలి.
3. CCE Register :
FA1 , 2 , 3 , 4 మరియు SA1పరీక్షలకు సంభందించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయివుండాలి అలానే వచ్చిన మార్కులు రిజిస్టర్ లో నమోదుచేయాలి. CCE Register లోని అన్ని columns పూర్తి చేయాలి..ఈ రికార్డ్ చివర్లో కూడా HM సంతకం చేసి స్టాంప్ వేయాలి..అలానే తదుపరి పరిశీలన నిమిత్తం జాగ్రత్తగా భద్రపరచాలి.
4. Pupils Attendance Registers :
వీనిని కూడా పూర్తి చేసి కట్ట కట్టి పైన 2019-20 అని slip వ్రాసి భద్రపరచండి.
5. Teachers Attendance Register :
ప్రతి నెలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రాతిపదికన అందరి పేర్లు వ్రాయాలి..చివర్లో మీ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు , ఎప్పటినుండి ఖాళీగా ఉన్నాయి , ఎందుకు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు తప్పక నమోదుచేయాలి. కొన్ని పాఠశాలల్లో ఈ రిజిస్టర్ పరిశీలించగా May నెల వ్రాయడం లేదు...May నెల జీతం కూడా తీసుకుంటున్నాం కాబట్టి May నెలలో కూడా మిగిలిన నెలలలో మాదిరిగానే వ్రాయాలి. మార్చి 19వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు కరోనా సెలవులు అని , ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 11వరకు వేసవి సెలవులు అని , జూన్ 12 నుండి 15 వరకు కరోనా సెలవులు తర్వాత హాజరైన రోజులలో ఉపాధ్యాయుల సంతకాలు.. హాజరుకాని వారి స్థానంలో CL/ML/ఇతర సెలవులు, ఈనెల 13వ తేదీ నుండి హాజరైన తేదీలలో సంతకాలు చేయాలి.
ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆశ్రద్ధగా ఉండి రికార్డులు అసంపూర్తిగా ఉంచి మనం ఆ పాఠశాల నుండి వెళ్లడం వల్ల మన తర్వాత వచ్చినవారు మనం పనిచేసిన కాలంలో సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ అసంపూర్తిగా ఉన్న రికార్డుల ఆధారంగా సర్టిఫికేట్లు ఎలా ఇవ్వాలో అర్ధం కాక వచ్చిన వారికి సమాధానం చెప్పలేక తలలు పెట్టుకొనే సందర్భాలు ఎన్నో. రికార్డులు విద్యార్థుల జీవితానికి సంబంధించినవి..కావున సరియైన విధానంలో update చేయండి..భవిష్యత్ అవసరాల కొరకు సరిగా భద్రపరచండి.
0 Post a Comment:
Post a Comment