జూలై 20 - చందమామ అందిన రోజు
అది 1969 జూలై 20, ఈ (2020) జూలై 20 నాటికి, మానవుడు చంద్రుడిపై దిగి (కాలుమోపి) సరిగ్గా 51 సంవత్సరాలు పూర్తౌతున్నాయి..
అపోలో 11 ద్వారా జూలై 16న చంద్ర మండల యాత్రకు బయలుదేరారు, ముగ్గురు అమెరికన్ వ్యోమగాములు.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్స్ లు..
వారు జూలై 20న చంద్రుడ్ని చేరారు. 'కోలిన్స్' కమాండ్ మాడ్యూల్ లో కూర్చొని చంద్రుని చుట్టూ, అంతరిక్షంలో తిరుగుతుండగా, 'నీల్', 'బజ్'లిద్దరూ "ఈగిల్" అనే ల్యాండింగ్ మాడ్యూల్ తో మెల్లగా చంద్రునిపై దిగారు. కాని 6 గంటల పాటు బయటకు రాకుండా, ల్యాండింగ్ మాడ్యూల్ లోనే ఉండి చుట్టూ పరిస్థితులను పలికిస్తూ అలాగే కూర్చున్నారు..
చంద్రోపరితలంపై ల్యాండింగ్ మాడ్యుల్ దిగిన ఆరు గంటల తర్వాత, చంద్రునిపై మొట్ట మొదట దిగి కాలుమోపింది మాత్రం 'నీల్ ఆర్మ్ స్ట్రాంగ్'.
ఆ తర్వాత 20 నిమిషాలకు 'బజ్ ఆల్డ్రిన్' కూడా దిగి చంద్రునిపై, తన పాదం మోపారు. రెండున్నర గంటల పాటు వారిద్దరూ చంద్రోపరితలంపై కలియ తిరిగారు..
అక్కడ వారి అమెరికాదేశ జెండాను పాతారు. అలాగే వారి (అమెరికా) దేశ అధ్యక్షుడితో కూడా మాట్లాడారు. అంతేగాక, వారు అక్కడి ఫోటోలూ తీసారు..
ఆ తర్వాత అక్కడి నుండి సుమారు ఓ 20 కిలోల చంద్ర శిలలను (చంద్రునిపై ఉన్న రాళ్ళను) తీసుకొని, భూమికి తిరుగు పయన మయ్యారు. ఇక అంతే.. చంద్రునిపై దిగిన తొలి మానవులుగా, వారి పేర్లు మానవ జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయాయి..
చంద్రుడిపై కాలుమోపిన తొలి మానవుడు 'నీల్ ఆర్మ్ స్ట్రాంగ్' చెప్పిన మాట...
0 Post a Comment:
Post a Comment