◾ సందేహం : CLEP ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుంది ?
🔘 సమాధానం : 15 రోజులు (మే 4 నుండి మే 22 వరకు)
◾ సందేహం : ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా హాజరు కావాలి ?
🔘 సమాధానం : యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో AP SCERT అని టైప్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ SCERT వారి ఛానెల్ ఓపెన్ అవుతుంది. అందులో మే 4 నుండి ఉదయం 11 నుండి 12 గంటలవరకు లైవ్ ప్రోగ్రాం ప్రసారం జరుగుతుంది.
◼️ సందేహం : CLEP ట్రైనింగ్ ప్రోగ్రాం లో ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లు ఎలా రాయాలి ?
🔘 సమాధానం : ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లు రాయటానికి ముందుగా ఉపాధ్యాయులు అందరు AP SCERT వారు తయారు చేసిన ABHYASA APP ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావలెను .ఈ ఆప్ లో రోజువారీ ఆన్లైన్ క్లాస్ కి సంభందించిన అసెస్మెంట్ టెస్ట్స్ లు పొందుపరచటం జరుగుతుంది.
◼️ సందేహం : స్మార్ట్ ఫోన్ / ఆండ్రాయిడ్ ఫోన్ లేనటువంటి ఉపాధ్యాయులు ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా హాజరు కావాలి ?
🔘 సమాధానం : స్మార్ట్ ఫోన్ /ఆండ్రాయిడ్ ఫోన్ లేని ఉపాధ్యాయులు ఉన్నట్లయితే, వారు ఈ CLEP - 2 శిక్షణ webinar ద్వారా తీసుకోలేనట్లైతే, వారు కరోనా లాక్ డౌన్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
▪ ఎవరు webinar ద్వారా ట్రైనింగ్ పొందారు, ఎవరు ట్రైనింగ్ పొందలేదు అనే విషయాలను గౌరవ మండల విద్యా శాఖాధికారులు ఎప్పటికప్పుడు గమనించి webinar ద్వారా ట్రైనింగ్ పొందని వారికి లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ శిక్షణ ఇప్పిస్తారు.
Login problem app downloaded but not opened
ReplyDeleteSir, my name is Pasam Prabhakar. Still I can't login in abhasya app.what to dog?
ReplyDelete