Thursday 30 April 2020

ఫోన్‌ కొంటే ఆరోగ్యసేతులో నమోదు తప్పనిసరి



ఫోన్‌ కొంటే ఆరోగ్యసేతులో నమోదు తప్పనిసరి









     ఇక మీదట కొత్త మొబైల్‌ ఫోన్‌ వినియోగించే వారు విధిగా తమ వివరాలను ఆరోగ్య సేతు యాప్‌లో రిజిష్టర్ చేసుకోవాలట. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో అమ్ముడయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ముందస్తు సేవల కింద ఆరోగ్య సేతు యాప్‌ ఉంటుందని సమాచారం. కొత్త ఫోన్‌ కొనుగోలు చేసినవారు దానిని ఉపయోగించడానికి ముందు యాప్‌లో తప్పనిసరిగా తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలి. త్వరలోనే కేంద్రం ఈ నిబంధనను అమలులోకి తేనుందట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఒక ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. దీని అమలు కోసం కేంద్రం త్వరలోనే కొత్త నోడల్‌  ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఏజెన్సీ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలతో సమయన్వయం చేసుకుంటూ, యాప్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటుందట.
    ఈ మేరకు వినియోగదారులు తప్పనిసరిగా వివరాలు రిజిష్ట్రర్‌ చేసుకునే విధంగా ఫోన్లలో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌బిల్ట్‌ ఫీచర్ కింద అందివ్వనున్నారు. కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ఈ యాప్‌ను దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలానే కరోనా ముప్పుపై హెచ్చరించేందుకు ఫీచర్‌ ఫోన్ల కోసం కూడా కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తేస్తామన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top