Sunday 19 April 2020

Appointments - Communal Roster (నియామకాలు - మతతత్వ జాబితా)



    Appointments - Communal Roster

నియామకాలు - మతతత్వ జాబితా








     ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్సు లోని రూలు-22 ప్రకారం ఉద్యోగ నియామకాలలో కొన్ని  తరగతుల వారికి రిజర్వేషన్ కలదు. అట్లే జిఓ. ఎంఎస్.నం. 99 జిపడి, తేది. 08.03. 1996 ద్వారా ఉద్యోగ నియామకాలలో స్త్రీలకు 33 1/3 శాతం రిజర్వేషన్ కల్పించబడినది. జిఓ.ఎంఎస్.నం. 65 , జిఎడి,తేది.15.02.1997 ప్రకారం సుపీరియర్ సర్వీసుకు చెందిన ప్రతి వంద పాయింట్ల రోస్టరులో కేటాయింపులు రిజర్వేషనులు ఉంటాయి.

ముఖ్యాంశాలు :

 1.  ఒక సైకిల్ లోని వంద పాయింట్ల లో 12, 37 పాయింట్లు మాజీ సైనికోద్యోగులకు కేటాయించబడినవి. వారు లేనిచో ఖాళీలు కొనసాగుతాయి. ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. అదే విధంగా 6, 31, 56 పాయింట్లు దివ్యాంగులకు కేటాయించబడతాయి. దానిలో 6, 106, 206 పాయింట్లు అంధత్వం లేక తక్కువ చూపు కలవారికి, 31, 131, 231 పాయింట్లు బధిరులకు, 56, 156, 256 పాయింట్లు లోకోమోటర్ డిజెబులిటి లేక సెరిబ్రల్ పాల్సి వారికి కేటాయించబడతాయి. 106,131, 256 పాయింట్లు మహిళలకు 6, 31, 56, 156, 206, 231 పాయింట్లు ఓపెను కేటాయించబడినాయి. (జిఓ నం. 23, తేది. 26.05.2011 మరియు జిఓ నం. 3, తేది.12.02.2015)

2.  దివ్యాంగుల పాయింట్లలో మహిళలకు కేటాయించబడిన పాయింట్లలో వారు లభించనప్పుడు ఆ ఖాళీ తదుపరి నియామకం సంవత్సరమునకు బదిలీ చేయబడుతుంది. ఆ సంవత్సరంలో కూడ లభించకపోతే ఆ ఖాళీ దివ్యాంగ మహిళలలోనే తదుపరి రోస్టర్ పాయింట్ కు  కేటాయించ బడుతుంది. అప్పటికి లభించకపోతే దివ్యాంగులు కాని వారిచే భర్తీ చేయబడుతుంది.

3.  దివ్యాంగుల పాయింట్లలో ఓపెన్ కేటగిరీలో దివ్యాంగులు లభించకపోతే తదుపరి నియామక సంవత్సరమునకు ఆ ఖాళీ బదిలీ చేయబడుతుంది. ఆ సంవత్సరం కూడ లభించకపోతే ఆ ఖాళీ తదుపరి రోస్టర్ పాయింట్ కు కేటాయించ బడుతుంది. అప్పటికీ లభించకపోతే దివ్యాంగులు కాని వారిచే భర్తీచేయబడతాయి.

4.  ఎస్టీలకు ఒక కేడర్ లోని పోస్టుల సంఖ్య 6, 7, 8 వరకు ఒక పోస్టుకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించబడుతుంది. (జిజ్ ఎంఎస్ నం. 4, తేది. 20.01.2007)

5.  ప్రతి 3వ సైకిల్లోని 14వ పాయింట్ బిసి (సి) మహిళకు కేటాయించ బడుతుంది. 

6.  100 పాయింట్ల రోస్టరు ప్రతి కేడరుకు వేర్వేరుగా వర్తిస్తుంది. తగిన అభ్యర్థిని మెరిట్ లిస్టు నుండి ఎంపిక చేసి రోస్టర్ పాయింట్లను క్రమపద్ధతిలో నింపాలి. (మెమో.నం. 42005/సర్వీస్-2/2002 జిఎడి తేది18.09.2002)

7.   లోకల్ మరియు నాన్ లోకల్ తో కూడిన 'ఓపెన్ క్యాటగిరి' క్రింద మొత్తం ఖాళీలలో 20% కేటాయించగా మిగిలిన 80% లోకల్ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. మరియు ఒక రిక్రూట్మెంట్ లో జరిగిన నియామకాలలో చివరి రోస్టర్ పాయింట్ తదుపరి పాయింట్ నుండి మరొక రిక్రూట్మెంట్ కై సెలక్షన్ లిస్టు తయారు చేయబడుతుంది.

8. ఓపెన్ కాంపిటిషనకు షెడ్యూల్డ్ కులాలు,జాతులు, వెనుకబడిన తరగతుల వారిని కూడా పరిగణన లోనికి తీసుకొంటారు.

9.  షెడ్యూల్డ్ కులాల, జాతుల, వెనుకబడిన తరగతుల వారికి కేటాయించబడిన ఖాళీలను వారితోనే నింపాలి. వారిలో అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు ఖాళీలు అట్లే కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ అనుమతితో ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులకు వాటిని కేటాయించవచ్చును. అందుకు సమానమైన ఖాళీలను తదుపరి నియామకములో వారికి కేటాయించాలి. 

10.   వెనుకబడిన తరగతులు మరియు షెడ్యూలు కులములలోని ఒక గ్రూపులో తగిన అభ్యర్థి లేనప్పుడు ఆ ఖాళీలను ఇతర గ్రూపులకు చెందిన వారితోనింపవచ్చును.

11.   నియామక ఉత్తర్వులు యిచ్చినను, అభ్యర్థి ఆ ఉద్యోగములో చేరనప్పుడు, రోస్టరులోని ఆ పాయింటు ఖాళీగానే వున్నట్లు పరిగణించ బడుతుంది. 

ప్రమోషన్స్ లో రిజర్వేషన్ : ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్ సౌకర్యం జి.ఓ. 5 ద్వారా కల్పించ బడినది. ఒక క్యాడరులోని పోస్టుల సంఖ్య 5 కంటే ఎక్కువగా వున్నప్పుడు పైన చూపిన విధంగా రిజర్వేషన్ వర్తిస్తుంది. సీనియార్టీ పాటించుట వలనగాని, సీనియార్టీతో సంబంధం లేకుండా రిజర్వ్డు రోస్టర్ పాయింట్ల వద్దకు సర్దుబాటు చేయుట వలనగాని రిజర్వేషన్ శాతము పూర్తయితే ఆ తర్వాత వున్న పాయింట్లకు రిజర్వేషన్ వర్తించదు. రిజర్వేషన్ శాతము ప్రకారము పోస్టుల సంఖ్యను నిర్ణయించి నపుడు భాగ ఫలము 0.5గాని అంతకు మించిగాని వున్న యెడల తదుపరి సంఖ్యకు సవరించ బడును. దివ్యాంగులకు జి.ఓ. నం. 42 తేది. 19.10.2011 ద్వారా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడినది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top